AP | సీఎంకు పాలాభిషేకం
- ఏడు వరాలపై దివ్యాంగుల హర్షం
AP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికోసం సీఎం చంద్రబాబు నాయుడు ఏడు వరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్(Koneru Center)లో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంద కృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఏ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించ లేదని, చంద్రబాబు నాయుడు దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణం(Free bus travel), టిడ్కో ఇళ్లలో కేటాయింపు సహా ఏడు వరాలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.

