Festival | శానిటేషన్ పనుల పర్యవేక్షణ

Festival | పెడన, ఆంధ్రప్రభ : పెడన పట్టణంలోని 1వ వార్డులో జరుగుతున్న పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల‌ సందర్భంగా పెడన మున్సిపల్ చైర్‌ప‌ర్స‌న్‌ కటకం నాగ కుమారి(Katakam Naga Kumari) ఆదేశాల మేరకు పైడమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలోని శానిటేషన్ పనులను చేపట్టారు. ఈ పనులను కౌన్సిలర్స్ కటకం ప్రసాద్, పిచ్చిక నాగ సతీష్ బాబు పర్యవేక్షించారు.

ఈ సందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు(arrangements) చేయాల‌ని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్ట‌ర్ పి. హరికిషోర్, సచివాలయ వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీ శ్రీనివాస్, వార్డ్ మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply