రెండేండ్ల పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు

  • గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ రైజింగ్ –2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్
  • ఎంపీ గడ్డం వంశీకృష్ణ

న్యూఢిల్లీ-ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధి : రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మకమైన సంక్షేమ, అభివృద్ధి నిర్ణయాలను తీసుకొని అమలు చేశారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తూచాతప్పకుండ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు.

గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏండ్ల పాలనలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను నిరుపేద రాష్ట్రంగా దివాళా తీయించిందని మండిపడ్డారు. అయినప్పటికీ… ఇచ్చిన హామీలు, ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి దాదాపు రూ.60 వేలు ఖర్చు చేశారన్నారు. ప్రజా ప్రభుత్వం రెండేండ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

రైతులు, మహిళలు, పేద ప్రజలకు అండగా ఉంటే పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సీఎం అమలు చేస్తున్నారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ. 8 వేల కోట్లు, రైతు భరోసా కు రూ.21 వేల కోట్లు. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ కోసం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

ప్రజా పాలనలో అన్ని వర్గాలు ఆనందంగా, సంతోషంగా ఉన్నాయన్నారు. ఈ నెల 8, 9 న ఫ్యూచర్ సిటీలో రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను సీఎం నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో తెలంగాణ రైజింగ్ –2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ లో ఏవిధంగా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమి సృష్టించనున్నారో సీఎం వివరిస్తారన్నారు.

ఈ సమ్మిట్ కు రావాలని సీఎం, డిప్యూటీ సీఎంలతో కలిసి ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇతర ముఖ్య నేతలను పార్లమెంట్ లో కలిసి ఆహ్వానించినట్లు చెప్పారు.

గత మూడు రోజులుగా మిస్ మ్యానేజ్ తో సామాన్య ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించిన ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఎంక్వైరీకి ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. ఆ సంస్థ నిర్లక్ష్యం వల్ల ఒక్కరోజే 200ల విమానాలు రద్దు అయ్యాయని చెప్పారు. అంటే ఒక్క విమానంలో 250 ప్రయాణీకుల చొప్పులన 50 వేల కుటుంబాలు ఎయిర్ పోర్ట్ లో ఇబ్బంది పడ్డారన్నారు.

ఈ అంశంపై విచారణ చేపట్టాలన్నారు. ఇలాంటి విధానాలు దేశానికి మంచిది కాదన్నారు. సామాన్యుల పక్షాన డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఏయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా( ఏఏఐ) చర్యలు తీసుకోవాలని లేఖ కూడా రాస్తానన్నారు.

Leave a Reply