30 Police Act | శాంతియుతంగా ఎన్నికలు
- గ్రామపంచాయతీ ఎన్నికల భద్రత చర్యలపై రాష్ట్ర డీజీపీ సమీక్ష
- ఉమ్మడి జిల్లా అధికారులతో కీలక సమావేశం
- స్వేచ్చాయుతoగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఆన్ని ఏర్పాట్లు పూర్తి
30 Police Act | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర డీజీపీ బీ.శివధర్ రెడ్డి కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చేసిన సంధర్భంగా జిల్లా ఎస్పీ, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ పోలీసు గౌరవ వందనం స్వీకరించి, గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం(Police Office)లో ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య(P.Sai Chaitanya), ఐపీఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ల ద్వారా ఎన్నికల సంసిద్దతను తెలియజేశారు.
30 Police Act |ప్రత్యేక భద్రతా ప్రణాళికలు
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లకు ప్రత్యేక భద్రతా ప్రణాళికలు, బైండోవర్ చర్యలు, చెక్‌పోస్టులు, ఎన్ ఫోర్స్ మెంట్ బృందాల పనితీరు, స్వాధీనపు వివరాలు, పోలింగ్ రోజు భద్రతా ఏర్పాట్లు మొబైల్ టీమ్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్(Quick Response Teams) తదితర అంశాలను సమగ్రంగా వివరించారు. జిల్లా పరిధిలోని డీఎస్పీలతో డీజీపీ స్వయంగా మాట్లాడి వారి పరిధిలోని భద్రతా ఏర్పాట్లు, సమస్యలు ఫోర్స్ వినియోగంపై ప్రత్యక్ష వివరాలు సేకరించారు.
30 Police Act |ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు..
రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల సమయం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
కావున ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు, భయబ్రాంతులకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడం పోలీస్ శాఖ(Police Department) ప్రధాన బాధ్యత అని అధికారులకు తెలియజేశారు. జిల్లాలోని సున్నితమైన పోలింగ్ కేంద్రాల గ్రామాల వివరాలను అడిగి అక్కడ తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు.
30 Police Act |కఠిన చర్యలు తీసుకోవాలి…

సోషల్ మీడియా(Social Media)లో తప్పుడు ప్రచారం, ద్వేషపూరిత పోస్టులు లేదా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే కార్యకలాపాలను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
ఎన్నికల అనంతరం ఆదేరోజు విజయోత్సవ ర్యాలీల యందు వివాదములు తలెత్తే అవకాశాలు ఉన్నందున ఎవరూ ర్యాలీలు తీయరాదని తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్(30 Police Act) ఉన్నందున ముదస్తు అనుమతులు తప్పనిసరి అని సూచించారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
30 Police Act |బైండోవర్ చేసిన వ్యక్తుల్లో
కామారెడ్డి జిల్లాలో ఎన్నికల సందర్భంలో బైండోవర్ చేసిన వ్యక్తుల్లో ఐదుగురు ప్రవర్తన నిబంధనలను ఉల్లంఘించగా, వారి పూచికత్తుగా చూపిన డబ్బులపై జరిమానా విధించబడింది. బైండోవర్ పేపర్(Binderover Paper)కు మాత్రమే పరిమితం కాకుండా, ఎవరైనా బైండోవర్ సంబంధిత నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధించబడతుందని స్పష్టంగా తెలిపారు.
అలాగే, ఈ నియమాలను మళ్లీ ఉల్లంఘించిన వ్యక్తులపై చట్టపరమైన తగు చర్యలు కూడా తీసుకోబడతాయని పేర్కొన్నారు. ప్రజల భద్రత, రక్షణ పోలీసుల ప్రధాన లక్ష్యమని డీజీపీ పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, అదనపు ఎస్పీ (అడ్మిన్) కే. నరసింహారెడ్డి, నిజామాబాద్ అదనపు కమీషనర్ బస్వారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఉమ్మడి జిల్లాల డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.

