- ఎంపీటీసీ పై జరిగిన హత్యాఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం
- వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సి
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రగులుకుంటుంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం ఉండంగానే ఫ్యాక్షన్ గొడవలు మొదలయ్యాయి.
వైసీపీ ఎంపీటీసీ హరినాథ్ రెడ్డిపై టిడిపి నాయకులు దాడి చేశారంటూ, దీనిని వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ భాషా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రెడ్ బుక్కు రాజ్యాంగం పేరిట దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ సంర్భంగాప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎంపీటీసీ హరినాథ్ రెడ్డిని వారు పరామర్శించారు.
వారు మాట్లాడుతూ…. గత ఐదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న గ్రామంలో మళ్లీ ప్యాక్షన్ మంటలు రాజేయడం ఎంతో విచారకరమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిపై ‘రెడ్‌బుక్‌కు రాజ్యాంగం’ పేరిట దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు.

