CM Revanth | 6న సీఎం రేవంత్ రెడ్డి దేవరకొండ పర్యటన..

  • ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎమ్మెల్యే బాలునాయక్

CM Revanth | దేవరకొండ, ఆంధ్రప్రభ : ఈనెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) దేవరకొండ పర్యటన సందర్భంగా సభా ఏర్పాట్లను జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy), ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ ఎలా అభివృద్ధి చెందుతుందో… దేవరకొండ నియోజకవర్గాన్ని కూడా అలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి ఎమ్మెల్యే బాలునాయక్ లు చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాలనను ప్రజలు ప్రేమతో స్వీకరిస్తున్నారని వారు చెప్పారు. ఇదే దేవరకొండలో పదేండ్లు పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ వేసుకొని నక్కలగండిని పూర్తి చేసి నల్లగొండ జిల్లాని సస్యశ్యామలం చేస్తానని చెప్పిన పెద్దాయన టెంకడు మట్టి కూడా తీయలేదని మంత్రి అన్నారు.

ఎనిమిది వేల కోట్లు ఆదాయం ఆర్టీసీ సంస్థ(RTC organization)కు చెల్లించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుందని మంత్రి అన్నారు. సన్న బియ్యం పేద ప్రజలకు అందించడంలో ఐదు వేల కోట్లు ఖర్చు భారమైనా ప్రభుత్వం వెనుకాడకుండా ముఖ్యమంత్రి తినే సన్నబియ్యం పేద ప్రజలు కూడా తినాలని.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆలోచించి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందిస్తున్నారని ఆయన చెప్పారు. సొరంగంలో జరిగిన ప్రమాద ఘటనతో పనులు కొంత ఆలస్యమైనా పూర్తిచేసుకుని ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించే బాధ్యతపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని మంత్రి గుర్తు చేశారు.

విద్యుత్ భారం కాకుండానే శ్రీశైల సొరంగ మార్గం పూర్తిచేసుకుని గ్రావిటీ ద్వారా సాగు, తాగునీరు అందించేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేవరకొండ నియోజకవర్గం(Devarakonda constituency) కొడంగల్ మాదిరిగా దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు తాము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు మంత్రి చెప్పారు. పేద ప్రజలు విద్యకు దగ్గర కావడానికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ప్రారంభించుకొని పేదవారికి నాణ్యమైన విద్యను అందించేందుకే ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నట్లు మంత్రి చెప్పారు.

ఈ నియోజకవర్గంలో గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప.. మళ్ళీ రేవంత్ రెడ్డి హ‌యాంలోనే నియోజకర్గం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ(Alampalli Narasimha), ముక్కల మాల వెంకటయ్య గౌడ్, జాల నరసింహారెడ్డి, ఏవి రెడ్డి, ఎండి యూనిస్, పొన్నబోయిన సైదులు, తదితరులు ఉన్నారు.

Leave a Reply