Virtual | గాంధీజీ గ్రామ స్వరాజ్య దిశగా ఎన్డీఏ అడుగులు

Virtual | గాంధీజీ గ్రామ స్వరాజ్య దిశగా ఎన్డీఏ అడుగులు

  • పంచాయతీరాజ్‌లో చరిత్రాత్మక విప్లవానికి శ్రీకారం
  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Virtual | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలోకి తెచ్చే క్రమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలక ముందడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ (Konidela Pawan Kalyan)వెల్లడించారు. పంచాయతీరాజ్ పాలనను పూర్తిగా బలోపేతం చేసేందుకు, 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా(across the state) ఏర్పాటు చేసిన 77 డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసులను గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

Virtual

చిత్తూరు నుండి నిర్వహించిన ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వి.ఆర్. కృష్ణతేజ మైలవరపు(Krishna Teja Milevarapu), జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు, పూతలపట్టు, తిరుపతి, కోడూరు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, కె. మురళిమోహన్, ఆరణి శ్రీనివాసులు, ఆరవ శ్రీధర్, చిత్తూరు మేయర్ అముద, చైర్పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, పలువరు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌కు లభిస్తున్న సహకారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పునర్నిర్మాణాత్మక(Reconstructive) సంస్కరణలు అమలు అవుతున్నాయని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో సుదీర్ఘకాలం నిలిచిపోయిన పదోన్నతుల సమస్యలు పరిష్కరించి దాదాపు 10 వేలమందికి ప్రమోషన్ లభించడం సంస్కరణల లోతును స్పష్టంగా చూపుతున్నదని వివరించారు. జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీ విభాగాల ఏకీకరణ(Integration of departments)తో పరిపాలనలో స్పష్టత, పనితీరులో వేగం వస్తోందని చెప్పారు. డిపిఓ స్థాయి అధికారిని డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి పెంచడం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని తెలిపారు.

Virtual

గ్రామ స్థాయిలో పెద్ద సంస్కరణగా 7,244 క్లస్టర్లను రద్దు చేసి మొత్తం 13,350 గ్రామ పంచాయతీలను స్వయం పాలనా సంస్థలుగా మార్చినట్లు చెప్పారు. ప్రతి పంచాయతీలో ఒక సెక్రెటరీని, పెద్ద పంచాయతీలలో ఒక గెజిటెడ్ పంచాయతీ(Gazetted Panchayat) డెవలప్మెంట్ అధికారిని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ఉన్న ఐదు గ్రేడ్ల పంచాయతీ సెక్రెటరీలను మూడు గ్రేడ్లుగా మార్చి, వారికి “పంచాయతీ అభివృద్ధి అధికారులు” అనే కొత్త పేరును ఇచ్చామని తెలిపారు. పంచాయతీ రాజ్ సంస్థలను సాంకేతికంగా బలోపేతం చేసేందుకు ఒక ప్రత్యేక IT వింగ్‌(Special IT Wing)ను ఏర్పాటుచేశామని చెప్పారు. గ్రామం నుండి జిల్లా వరకు ప్రజలకు అందే సేవలు పారదర్శకంగా, వేగంగా ఉండాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని సూచించారు.

పంచాయతీరాజ్ కమిషనర్ వి.ఆర్. కృష్ణతేజ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ పాలనాపరమైన సంస్కరణల భాగంగా జిఓ ఎంఎస్ 57, 58 జారీ చేసి కొత్త పరిపాలనా(New administration) నిర్మాణాన్ని అమలు చేశామని పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల తరహాలో పంచాయతీరాజ్ శాఖకు కూడా ఇప్పుడు డివిజినల్ స్థాయి కార్యాలయాలు లభించడం చారిత్రాత్మకమన్నారు. ఈ పోస్టులు గ్రూప్–1 ద్వారా కూడా భర్తీ చేసే అవకాశం ఉండటం ఉద్యోగార్థుల(of job seekers)కు గొప్ప అవకాశమన్నారు.

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ సంస్కరణలతో వ్యవస్థ మొత్తం రెట్టింపు పనితీరు సాధిస్తుందని పేర్కొన్నారు. ఆర్డిఓ తరహాలో డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసులు పనిచేయబోతుండటం, వారికి ఏపిడి, డీఎల్డిఓ స్థాయి అధికారాలు(DLDO level powers) ఉండటం వలన పంచాయతీ రాజ్, ఎం.జి.ఏన్.ఆర్.ఈ.జి.ఎస్ వంటి పథకాల పర్యవేక్షణ బలపడుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో కొత్త కార్యాలయాలను జెడ్‌పి నిధులతో జి+1 భవనాల రూపంలో నిర్మించి మౌలిక సదుపాయాలు(Infrastructure) అందిస్తామని చెప్పారు. ఎం.పి.డి.ఓలు, డి.డి.ఓలు కలిసి జిల్లా అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేస్తారని అన్నారు.

Virtual

ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నుండి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తెనాలి నుండి పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆత్మకూరు నుండి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పెనుగొండ నుండి బిసి సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మలు వర్చువల్‌గా పాల్గొన్నారు. వివిధ డివిజన్ల డెవలప్మెంట్ అధికారులు కూడా డిప్యూటీ సిఎంతో ఆన్‌లైన్‌లో మాట్లాడి తమ అభిప్రాయాలను తెలిపారు.

Leave a Reply