online fees | కలెక్టర్ ఆకస్మిక తనిఖీ…
- రవాణా శాఖ సేవల్లో నిబంధనల అమలు తప్పనిసరి
- నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
online fees | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని గగ్గలపల్లి గ్రామంలో ఉన్న జిల్లా రవాణా అధికారి (DTO) కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(Collector Badawat Santosh) ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల హాజరు, వారి పనితీరు, కార్యాలయ నిర్వహణ విధానాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.
కలెక్టర్ ఆన్‌లైన్‌లో అందిస్తున్న సేవలపై సమగ్రంగా ఆరా తీశారు. ముఖ్యంగా స్లాట్ బుకింగ్(Slot booking) వ్యవస్థ, వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సుల జారీ, పునరుద్ధరణ, వాహనాల ఓనర్‌షిప్ బదిలీ, రోడ్డు టాక్స్ చెల్లింపు, కమర్షియల్ వాహనాల అనుమతుల మంజూరు వంటి అంశాలపై అధికారులు వివరాలను సమర్పించారు. అదేవిధంగా ఆన్‌లైన్ ఫీజు(online fees)ల చెల్లింపు ప్రక్రియ, ఫిట్నెస్ వాహనాల తనిఖీలు ఎలా నిర్వహిస్తున్నారో కూడా కలెక్టర్ అధికారులు నుండి తెలుసుకున్నారు.
online fees | కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ
జిల్లా రవాణా కార్యాలయ పరిధిలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, పన్నుల చెల్లింపులు, వాహనాల బదిలీలు, డ్రైవింగ్ లైసెన్సుల జారీ, పునరుద్ధరణ, కమర్షియల్ వాహనాల(commercial vehicles) అనుమతులు వంటి కార్యకలాపాలు నిరంతరంగా కొనసాగుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. వాహనాల ఫిట్నెస్ తనిఖీలు, అవసరమైన పత్రాల పరిశీలన, రోజువారీ వాహన అనుమతుల మంజూరు వంటి పనులు కూడా నియమాల ప్రకారం నిర్వహిస్తున్నామని డీటీఓ చిన్న బాలు నాయక్ తెలిపారు.
online fees | డ్రైవింగ్ లైసెన్సుల జారీ

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. డ్రైవింగ్ లైసెన్సుల జారీ(issuance of driving licenses), వాహనాల ఫిట్నెస్ మంజూరు, రోడ్డు సురక్షా ప్రమాణాల ప్రకారం వాహనాల తనిఖీలు వంటి రవాణా శాఖకు సంబంధించిన అన్ని సేవలను పూర్తిగా నిబంధనలు, మార్గదర్శకాలు, చట్టపరమైన విధి విధానాలకు కట్టుబడి, పారదర్శకంగా, ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రజలకు అందించాలని అధికారులకు సూచించారు.
ఈ సేవలు సమయపాలనతో, బాధ్యతతో, వ్యవస్థబద్ధంగా అమలు కావాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా డీటీఓ కి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ వెంట నాగర్ కర్నూల్ జిల్లా రవాణా అధికారి చిన్న బాలునాయక్, ఆర్టీవో ఇన్స్పెక్టర్లు మహేష్, అనూప్ రెడ్డి, రాజశేఖర్, మనోజ్ కుమార్, తదితరులు ఉన్నారు.

