Competition | గెలుపు బాటలో మిట్టపల్లి మహేశ్వరి
Competition | కమలాపూర్, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మిట్టపల్లి మహేశ్వరి కుమారస్వామి గెలుపు బాటలో దూసుకుపోతున్నారు. చదువుతో పాటు గ్రామ సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్న మహేశ్వరి కుమార్(Maheshwari Kumar) స్వామిలకు గ్రామంలోని ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు.
గతంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన కుమారస్వామి పట్ల ఈసారి గ్రామస్తులు సానుభూతి కనబరుస్తూ వారిని స్వాగతిస్తున్నారు.
కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ(majority)తో గెలిపించాలని అభ్యర్థి మిట్టపల్లి మహేశ్వరి కుమార స్వామిలు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తే గ్రామ అభివృద్ధికి ఐదు సంవత్సరాలు కృషి చేస్తామని, దేశరాజు పల్లి గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యల పరిష్కారానికి(resolve the issues) ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ గ్రామ రూపురేఖలు మారుస్తామంటూ ఓటర్లను వేడుకుంటున్నారు.

