విశాఖ లో రంగా నాడు మహాసభ…

- కుల మతాలకు అతీతంగా నిర్వహణ..
- ఈనెల 26న భారీ బహిరంగ సభ..
- రంగా ఆశయ సాధన కోసమే…
- రాధా రంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..
- వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్..
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : కుల, మతాలు, వర్గ ప్రాంతాలతో సంబంధం లేకుండా విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వంగవీటి రంగ కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ ప్రకటించారు. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న విశాఖ లో ‘రంగ నాడు’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాధా రంగ రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో రంగనాడు పోస్టర్ ని రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ఆవిష్కరించారు. ఈ సభకు అన్ని పార్టీ ల్లో ఉన్న అభిమానులు రావాలని పిలుపునిచ్చారు.
తాను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని, రాధారంగ మిత్ర మండలి తరపున పనిచేయడానికే వచ్చినట్లు తెలిపారు. ఏ పార్టీ తో ఇప్పుడు తనకు సంబంధం లేదని చారిటబుల్ కింద రాధారంగ మిత్ర మండలి పని చేస్తుందన్నారు. తన రాజకీయ నిర్ణయం ఏమైనా ఉంటే తరువాత చెబుతానని, ప్రస్తుతం ప్రజలకు తన వంతుగా సేవ చేస్తా నాని,. రాధా రంగ మిత్ర మండలి కార్యక్రమం విస్తృతం చేస్తామన్నారు.
