Help Desk | నామినేషన్ కేంద్రాల పరిశీలన..
Help Desk | కొడకండ్ల, ఆంధ్రప్రభ : నామినేషన్లు సజావుగా జరిగేలా చూడాలని ఎలక్షన్ అబ్జర్వర్(Election Observer) ఐఎఫ్ఎస్ రవి కిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు కొడకండ్ల గ్రామంలో నామినేషన్ల స్వీకరణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రవి కిరణ్ మాట్లాడుతూ… నామినేషన్ స్వీకరణకు కేంద్రానికి అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలన్నారు.
నామినేషన్ ప్రక్రియలు అభ్యర్ధులకు ఎలాంటి సందేహాలున్నా హెల్ప్ డెస్క్(Help Desk) ద్వారా నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహించడంతో పాటు స్వీకరించిన నామినేషన్ పత్రాలను గ్రామాల వారిగా వేర్వేరుగా భద్రపర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొడకండ్ల తహసీల్దార్ చంద్రమోహన్, ఎంపీడీవో నాగ శేషాద్రి సూరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

