ఘనంగా దివ్యాంగుల దినోత్సవం

రాయపోల్, ఆంధ్రప్రభ: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని PMSHRI రాయపోల్‌ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుదవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థుల ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

దివ్యాంగుల కోసం ప్రభుత్వం అందిస్తున్న Transport Allowance, Escort Allowance, Stipend వంటి సదుపాయాలను ప్రత్యేక ఎడ్యుకేటర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎడ్యుకేటర్స్ అనిల్ కుమార్, శిరీష పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాద్యాయులు నర్సింగరావు, దివ్యాంగుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply