Actions | డ్రగ్ క్లీన్ జిల్లాగా గుంటూరు..
- మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో ఎస్పీ వకుల్
Actions | గుంటూరు, ఆంధ్రప్రభ: రోజురోజుకూ వినియోగం పెరుగుతున్న మాదక ద్రవ్యాలను అరికట్టే దిశగా పటిష్ట చర్యలు(Strong measures) తీసుకుంటున్నామని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. గుంటూరు జిల్లాలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్) నిర్మూలన, నియంత్రణ లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం(Mechanism steel foot) మోపడానికి ప్రణాళిక తయారు చేసినట్లు చెప్పారు. టాస్క్ ఫోర్స్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, ప్రత్యేక ఈగల్ టీమ్ సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నవంబర్ 1 నుంచి 28 వరకు కేవలం 28 రోజుల్లో 12 మాదక ద్రవ్యాల కేసులు నమోదు చేసి, 42 మందిని అరెస్టు చేసినట్లు, ఒక వాహనాన్ని సీజ్ చేసినట్లు గణాంకాలతో(with statistics) వివరించారు. ఈ ప్రచారంలో భాగంగా “సంకల్పం – మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం” పేరుతో యువతలో అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో(on a broad scale) సమావేశాలు, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారీయా మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నిర్మూలనలో పర్యవేక్షణ, నివారణ కీలకమని స్పష్టం చేశారు.

ముఖ్యంగా విద్యాసంస్థలు, వసతి గృహాల్లో నిరంతర పర్యవేక్షణ జరిపి, మాదక ద్రవ్యాలకు ఆకర్షితులవుతున్నవిద్యార్థులను ప్రారంభ దశలోనే గుర్తించి, వారిని ఆ వ్యసనం నుండి దూరం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. వారికి తగిన కౌన్సిలింగ్, సైకాలజికల్ సపోర్ట్, డీ-అడిక్షన్(De-addiction) సెంటర్లలో చికిత్స అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పడిన ఈగల్ క్లబ్బుల నోడల్(Eagle Clubs Nodal) అధికారుల వివరాలను తక్షణమే పోలీస్ శాఖకు పంపాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ఈ క్లబ్బుల ద్వారా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, వాటి పురోగతి నివేదికలను(Progress reports) తదుపరి సమావేశానికి అందించాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ అనేది ఒకే శాఖ బాధ్యత కాదని స్పష్టం చేస్తూ, ఇతర శాఖల పాత్రను కలెక్టర్(collector) నొక్కి చెప్పారు. మత్తు, వైద్య మందుల అక్రమ విక్రయాలను అరికట్టడానికి డ్రగ్ కంట్రోల్ శాఖ నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
మాదక ద్రవ్యాల హానికర ప్రభావాలపై విద్యార్థులు, యువతకు విస్తృత ప్రచారం చేయాలని, మత్తు పదార్థాల రవాణా, వినియోగం, తయారీ లేదా సరఫరా వంటి సమాచారం(information) ఎక్కడైనా తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం రూపొందించిన పోలీస్ శాఖ ప్రచార పోస్టర్లను కలెక్టర్ తమీమ్ అన్సారియాతో, ఎస్పీ వకుల్ జిందాల్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) జి.వి. రమణమూర్తి, వివిధ శాఖల అధికారులు(Officers of various departments) పాల్గొన్నారు.

