ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా…

- మంత్రి డా.వాకిటి శ్రీహరి
ఊట్కూర్, ఆంధ్రప్రభ : పార్టీని, తనను నమ్ముకుని పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని రాష్ట్ర పాడి పరిశ్రమల, క్రీడలు, యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ బీజేపీ దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కోక్కుమల్లేష్ బుధవారం మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన కొక్కు మల్లేష్ కు మంత్రి వాకిటి శ్రీహరి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కొక్కు మల్లేష్ మాట్లాడుతూ… బీజేపీలో గత కొన్నేళ్లుగా పనిచేసిన తనకు సరైన గుర్తింపు లేకపోవడంతో కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి.యగ్నేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్, మైనార్టీ మండల అధ్యక్షులు జలాల్, పట్టణ అధ్యక్షులు కొక్కు లింగం, నాయకులు, కార్యకర్తలు మోహన్ రెడ్డి, నరసింహరాజుగౌడ్, శంకర్, రవికుమార్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
