GPO | ఈ జీపీవో మాకు వద్దు

GPO | ఈ జీపీవో మాకు వద్దు
- సమయపాలన పాటించడం లేదు
- ఎండ్రీయాల గ్రామస్తుల వినతిపత్రం
GPO | తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : కొత్తగా విధుల్లోకి చేరిన జీపీఓ సమయపాలన పాటించడం లేదని ఎండ్రీయాల గ్రామస్తులు తహసిల్దార్ శ్వేతకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీపీఓ(GPO) మధు విధుల్లోకి చేరినప్పటి నుండి మా ఊరికి రావడం లేదని ఫోన్ చేసిన రెస్పాండ్(Respond) కావడం లేదని, ఏదైనా సమస్యలు చెప్పాలంటే పట్టించుకోవడంలేదని జిపిఓను మార్చి వేరే జిపిఓ ను పంపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సుధాకర్ రావు , సంజీవులు రవి గ్రామస్తులు పాల్గొన్నారు.
