- కరప రైతులతో మాటామంతీ
ఆంధ్రప్రభ, బాపట్ల కలెక్టరేట్ : దిత్వా తుఫాన్ ప్రభావ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట సోమవారం సాయంత్రం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కరప గ్రామంలో నేరుగా పొలాల వద్దకు వెళ్లి రైతులను పరామర్శించారు.
ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. సమస్యలు ఉంటే కమాండ్ కంట్రోల్ రూమ్ కు చరవాణి ద్వారా సమాచారం అందించాలని రైతులకు చెప్పారు.7702806804, 1967 నెంబర్లకు నేరుగా ఫోన్ చేయవచ్చునని తెలియజేశారు. ధాన్యం రవాణా ఖర్చు గోతాల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని అవగాహన కల్పించారు.
ధాన్యం తడవకుండా ప్రభుత్వం ధాన్య సేకరణ కేంద్రాల ద్వారా టార్పాలిన్ పట్టాలు అందిస్తుందని చెప్పారు. అవసరమైన టార్పాలిన్ లు తీసుకొని ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

