District wide | జిల్లాలో పోలీసు యాక్ట్
- సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్
District wide | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు (For a month) డిసెంబర్ 1 నుంచి 31 వరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్(District SP Paritosh Pankaj) తెలిపారు. సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేనిదే ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సమావేశాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.
శాంతి భద్రతలకు(For peace and security) భంగం కలిగే విధంగా, ప్రజాధనానికి నష్టం కల్గించే, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు (Leaders of various communities) ఈ విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా ఎస్పీ సూచించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్ట రీత్యా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్(Election Code) అమలులో ఉన్నందున, ఇతర వ్యక్తులను కానీ, రాజకీయ పార్టీలను కానీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినా, సామాజిక మాద్యమాల్లో పోస్టులు పేటినా చట్టరీత్యా కఠిన చర్యలు (Strict legal measures) తప్పవన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేస్తున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు.

