Guarantees | నర్సంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన అనేక హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని తెలంగాణ జాగృతి యూత్ రాష్ట్ర కార్యదర్శి తడిగొప్పుల మల్లేష్ (Mallesh thadigoppula) ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మల్లేష్ మాట్లాడుతూ… బీసీలకు ఇచిన హామీలను నెరవేర్చని ప్రభుత్వాలను నమ్మకుండా బీసీ నాయకులంతా ఏకమై స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని (To be strong) ఆయన పిలుపునిచ్చారు.
బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీలన్నింటికి చెంపపెట్టులాగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల్లో భాగంగా సర్పంచ్(sarpanch) ఎన్నికల బరిలో నిలిచిన బీసీలు.. పోటీలో ఐక్యమత్యంగా (Unanimously) రాజకీయాలకు అతీతంగా బీసీలను గెలిపించుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. బీసీలు పట్టు కోల్పోతే భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదన్నారు.
ఈ రాష్ట్రంలో ఎక్కడ బీసీలు పోటీలో ఉన్నా… అక్కడున్న బీసీ నాయకులందరూ కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా మంచి నాయకులను ఎన్నుకొని భవిష్యత్తు (future) రాజకీయాలకు బాటలు వేయాలన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలు వారి ఉనికిని చాటకపోతే భవిష్యత్తులో బీసీలకు రాజకీయ అవకాశాలు సన్నగిల్లడంతో పాటు అంధకారంలో(in the dark) పడిపోతారన్నారు. బీసీ మేధావులు, విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు మీ ప్రాంతాల్లో పార్టీలకతీతంగా బీసీ నాయకుల పక్షాన నిలబడి వారిని గెలిపించలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

