Helicopter | గూడెంలో.. సీఎం

Helicopter | గూడెంలో.. సీఎం


Helicopter | ఏలూరు / ఉంగుటూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో : ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం హెలికాప్టర్ (Helicopter) ద్వారా ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి 11:40 లకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పుష్పగుచ్చాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎంపీ(MP) పుట్టా మహేష్ కుమార్, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు, డా. కామినేని శ్రీనివాస్, ఏపీ అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఐజి అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ మురళీకృష్ణ, ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply