1st Dec Samantha| మళ్లీ పెళ్లి

Samantha| సమంత, రాజ్ నిడిమోరు ఇద్దరూ ప్రేమలో ఉన్నారని.. గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ మేన్ (Family Man) వెబ్ సిరీస్ చేస్తున్న టైమ్ నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని.. ఆ స్నేహం ప్రేమగా మారిందని కథనాలు వచ్చాయి. అలాగే పెళ్లి గురించి వార్తలు వచ్చినా.. ఈ ఇద్దరు ఖండించలేదు. దీంతో ఈ వార్తలు నిజమే అని అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే సామ్ – రాజ్.. ఇద్దరూ ఈ రోజు చెన్నైలోని ఓ ఆశ్రమంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారని తెలిసింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగిందని వార్తలు వస్తున్నాయి.
1st Dec Samantha| 2022లో శ్యామిలీతో విడాకులు
ఈరోజు సాయంత్రం వీరిద్దరూ ఈ పెళ్లిని (Marriage) అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే.. రాజ్ మాజీ భార్య శ్యామిలీ తీవ్ర ఒత్తిడిలో ఉన్న వారు తీవ్రమైన పనులు చేస్తారు అని అర్ధం వచ్చేలా ఆదివారం రాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం అందర్నీ ఆకర్షించింది. అయితే.. రాజ్ 2022లో శ్యామిలీతో విడాకులు తీసుకోగా సమంత, చైతన్యతో 2021లో డైవర్ష తీసుకున్నారు.

