MLA | పుట్టినరోజున సైతం…

MLA | పుట్టినరోజున సైతం…


MLA | గుడివాడ, ఆంధ్రప్రభ : నిరంతరం ప్రజల మంచి కోసం ఆలోచించే సీఎం చంద్రబాబు.. వారి శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే (MLA) వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ పట్టణం పదో వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం ఉదయం పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్లతో పాటుగా పలువురు లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు.

నూతన పెన్షన్ (Pension) నగదు అందుకున్న లబ్ధిదారులు… పుట్టినరోజును సైతం ప్రజల మధ్యనే పర్యటిస్తున్న ఎమ్మెల్యే రాముకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గంలో నేడు 43 కొత్త పెన్షన్లు మంజూరైనట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబు ప్రణాళిక ప్రకారం కొత్త పెన్షన్ల మంజూరును నిరంతర ప్రక్రియగా చేయడమే కాకుండా, వితంతు పెన్షన్లు ప్రక్రియను సులభతరం చేశారన్నారు. గొప్ప ఆలోచనలతో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తూ…అనేక మంచి పనులు చేస్తుందన్నారు.

కార్యాలయాల్లో కూర్చొని చట్టాలు చేయడం కాదు.. ప్రజల మధ్య ఉంటూ.. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వారిని ఆదుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని పేర్కొన్నారు. మాకు ప్రజలేముందని, పుట్టినరోజు వేడుకలను కూడా వారిని కలుసుకునే అవకాశంగా భావిస్తానని మీడియా (Media) ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే రాము సమాధానమీచ్చారు.

శాసనసభ్యుడిగా నా బాధ్యతలే నాకు ముఖ్యమని, ప్రజల మంచి కోసం, గుడివాడ అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళతానని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ (AP State Ware Housing) కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్, సీనియర్ టిడిపి నాయకులు డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, చేకూరు జగన్మోహన్రావు, పండ్రాజు సాంబయ్య, టీడీపీ నాయకులు షేక్ మౌలాలి, సయ్యద్ జబీన్, మహమ్మద్ రఫీ, సయ్యద్ మున్వర్, గడ్డం ప్రకాష్ దాస్, జనసేన నాయకులు ఆంజనేయులు, సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply