నాగులకుంట తండా ఏకగ్రీవం..

  • సర్పంచ్‌కు ఎమ్మెల్యే మేఘారెడ్డి సన్మానం

పెద్దమందడి: (ఆంధ్రప్రభ): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్లఖానాపురం నాగులకుంట తండ గ్రామపంచాయతీకి చెందిన కేతావత్‌ మన్నెమ్మ రామ్‌ సింగ్‌ సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు.

వార్డుల విషయానికొస్తే, మొత్తం ఆరు వార్డులకు కూడా ఒక్కొక్క నామినేషన్ మాత్రమే రావడంతో అవి కూడా ఏకగ్రీవం కానున్నాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ పంచాయతీ ఏకగ్రీవమవుతున్న విషయాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి సర్పంచ్‌గా ఏకగ్రీవమైన మన్నెమ్మను అభినందించి, శాలువా కప్పి సన్మానించారు. అదే విధంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులకు కూడా అభినందనలు తెలిపారు.

Leave a Reply