AP | రేపటి నుంచి శాసనసభ సమావేశాలు – ఏర్పాట్లపై స్పీకర్ సమీక్ష

వెలగపూడి |ఎపి శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభ కానున్న సందర్భంగా ఈ సమావేశ ఏర్పాట్లకు సంబంధించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తాతో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశాల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు.అనంతరం మీడియా పాయింట్, కొత్తగా నిర్మిస్తున్న క్యాంటీన్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా పరిశీలించి తగు సూచనలు చేశారు .ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ కార్యదర్శి జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

సమావేశపు ముఖ్యాంశాలు:

గవర్నర్ ప్రసంగం జరిగే రోజు ఉదయం 9.30 గంటలకు సభ్యులందరూ సభలో హాజరు కావాల్సి ఉంటుంది.

బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, అధికారుల వ్యక్తిగత సహాయకులకు పాసులు జారీ చేయబడవు. అందువల్ల వారికి ప్రవేశం ఉండదు. సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేసారు.

ముఖ్యమంత్రిని కలిసే సందర్శకులు, ప్రతినిధులు శాసనసభ ప్రాంగణంలో అనుమతించరు. కావున, వారు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే భేటీ కావాలి.

శాసనసభ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పోలీసు శాఖకు సహకరించాలని అందరినీ కోరారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *