Rajamouli | వారణాసి టైటిల్ మారబోతుందా..?

Rajamouli | వారణాసి టైటిల్ మారబోతుందా..?
Rajamouli, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు, (Mahesh Babu) దర్శకధీరుడు రాజమౌళి.. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ, క్రేజీ పాన్ వరల్డ్ మూవీకి వారణాసి అనే టైటిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత వివాదస్పదం అయ్యింది. గతంలో ఈ టైటిల్ తో సి.హెచ్. సుబ్బారెడ్డి అనే దర్శకుడు సినిమాను అనౌన్స్ చేశారు. అలాగే టైటిల్ అండ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే.. జక్కన్న ఈ టైటిల్ ని వేరే వాళ్లు రిజిస్టర్ చేయించారో లేదో అనేది తెలుసుకోలేదో.. లేక ఎవరైనా రిజిస్టర్ చేయించుకున్నా.. తను అడిగితే ఇచ్చేస్తారులే అనుకున్నారో ఏమో కానీ.. తన సినిమా టైటిల్ వారణాసి.. అని ప్రకటించి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఆతర్వాత ఈ టైటిల్ వివాదం ఫిల్మ్ ఛాంబర్ కి చేరింది. వారణాసి టైటిల్ ను ముందుగానే రిజిస్టర్ చేయించుకున్న దర్శకుడు సి.హెచ్. సుబ్బారెడ్డి, నిర్మాణ సంస్థ రామ బ్రహ్మ హనుమ క్రియేషన్స్.. టైటిల్ మార్పు విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా ఉండడంతో చివరికి రాజమౌళినే తన టైటిల్ మార్చుకోవాల్సి వచ్చింది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇప్పుడు వారణాసి అనే టైటిల్ కు ముందు రాజమౌళి అని యాడ్ చేసి.. రాజమౌళి వారణాసి గా మార్చారని తెలిసింది. గతంలో మహేష్ బాబు ఖలేజా సినిమా టైటిల్ విషయంలో కూడా ఇలాంటి వివాదమే వస్తే.. అప్పుడు మహేష్ ఖలేజాగా మార్చారు. అయితే.. ఒక్క తెలుగులోనే రాజమౌళి వారణాసిగా (Varanasi) ఉంటుందని.. మిగిలిన భాషల్లో టైటిల్ విషయంలో ఎలాంటి వివాదం లేకపోవడంతో తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వారణాసి అనే టైటిల్ తోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తారని సమాచారం. అయితే.. తెలుగులో ఈ టైటిల్ మార్పు పై త్వరలో అఫీషియల్ గా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Pingback: CHAMPIONS | ఫైనల్లో దుమ్ము రేపిన డబుల్స్ జోడీ… - Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP