Panchayat Elections | అర్థరాత్రి వరకు..

Panchayat Elections | అర్థరాత్రి వరకు..
Panchayat Elections, చందూర్, ఆంధ్రప్రభ : చందూర్, మోస్రా మండలాల్లో చివరి రోజు భారీగా సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు.మోస్రా మొత్తం 5 సర్పంచ్ స్థానాలకు 35( మోస్రా 10, చింతకుంట 9, దుబ్బతండా 4, గోవూర్ 6, తిమ్మాపూర్ 6) నామినేషన్లు వచ్చాయి. 52 వార్డు స్థానాలకు మొత్తం 141 నామినేషన్లు వచ్చాయి. చందూర్ లో మొత్తం 5 సర్పంచ్ స్థానాలకు 54 (చందూర్18, ఘన్పూర్12, కారేగాం 12, లక్ష్మాపూర్ 8, మేడిపల్లి 4) నామినేషన్లు వచ్చాయి. 48 వార్డు స్థానాలకు మొత్తం 118 నామినేషన్లు వచ్చాయి. చందూర్ (Chandur) మండలంలో నామినేషన్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది.
