Aviation Minister : కూటమితోనే అభివృద్ధి

Aviation Minister : కూటమితోనే అభివృద్ధి
- డబుల్ ఇంజన్ తో ఏపీ పరుగులు
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఆంధ్రప్రభ బ్యూరో, గార( శ్రీకాకుళం)
డబుల్ ఇంజన్ సర్కారు తోడ్పాటుతో ఏపీ రెట్టింపు వేగంతో మరింత అభివృద్ధి వైపు పయనిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి (K.Ram Mohan Nayudu) కింజరాపు రామ్మోహన్ నాయుడు (Aviation Minister) అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో శనివారం ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
తొలుత వమరవల్లి డైట్ (Vamara palli Dait school) పాఠశాలలో అదనపు భవనాలకు 2.4 కోట్లు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తయిన అదనపు తరగతి గదులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ (MLA Samkar) తో కలసి ఆయన ప్రారంభించారు.
నూతన భవనాల్లో ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మంది విద్యార్థులకు సేవలు అందే విధంగా పలు సూచనలు చేశారు. అదనపు తరగతి గదుల్లో (Additional class Rooms) బోధనా గదులు 2, స్మార్ట్ క్లాస్ గదులు 2, కంప్యూటర్ ల్యాబ్ కమ్ ఐటి ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్ లాంగ్వేజ్ ల్యాబ్, సోషల్ సైన్సెస్ ల్యాబ్, వర్క్ ఎక్స్పీరియన్స్ కు ల్యాబ్, ఫిజికల్ లిటరసీ ల్యాబ్, గర్ల్స్ వాల్టింగ్ హాల్ లతో కలిపి ఈ భవనాలను 2.40 కోట్ల రూపాయలతో నిర్మించారు.
భవనంలోని గదులు పరిశీలించిన కేంద్ర మంత్రి.. అందించిన వసతులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఇదే ప్రాంగణంలో ఆడిటోరియం, రెండు డార్మిటరీలు గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని వసతులతో కూడిన 4 గదులు, మొదటి అంతస్తులో 4 గదుల డిజైన్ తో 6.06 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న భవన సముదాయానికి కేంద్ర మంత్రి (Foundation) శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులు 40 లక్షలతో గార (Gara village) మండల కేంద్రంలో నిర్మించిన సచివాలయ భవనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. గదులను పరిశీలించి సౌకర్యంగా ఉన్నాయని కితాబిచ్చారు.
శ్రీకాకుళం రూరల్ మండలంలోని చాపురం, పాత్రునివలస గ్రామాల్లో రోడ్ల ప్రారంభోత్సవంలో (Roads) పాల్గొనడంతో పాటు డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం నగరంలోని పిఎస్ఎన్ఏం పాఠశాల ఎదురుగా రోడ్డుతో పాటు, దివంగత కింజరాపు ఎర్రంనాయుడు (Yerram naidu Park) పేరుతో నిర్మించిన పార్క్ ను రామ్మోహన్ నాయుడు (Opened) ప్రారంభించారు.
పార్క్ పరిసరాలను కలియతిరిగి నిర్మాణం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో నియోజవర్గ కూటమి శ్రేణులు ఎక్కడికక్కడ ఘన స్వాగతాలు పలికారు. ఈ సంధర్భంగా పలు చోట్ల ఆలయాలను కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
