Sharmila Quationer : అమరావతిలో రియల్ లూటీ
- అదానీ అంబానీ కోసమే
- రెండవ విడత పూలింగ్
- ఇందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం
- అఖిలపక్షం భేటీ ఏర్పాటు చేయండి
- ఎంత భూమి తీసుకున్నారు
- ఏం చేశారో లెక్కలు చెప్పండి
- ఏపీ కాంగ్రెస్ అధినేత్రి ప్రశ్నల వర్షం
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా , – అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతోందని ఏపీ పీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల (Ys Sharmila Fired) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సర్కారుపై, సీఎం చంద్రబాబుపై (Againist Second Land Puling) నిప్పులు చెరిగారు. అనేక సూటి ప్రశ్నలతో నిలదీశారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం విలేఖరులతో షర్మిల మాట్లాడుతూ, రాజధాని – మొదటి దశలో 25 గ్రామాల నుంచి 34 వేల ఎకరాలు తీసుకున్నారు, – 29 వేల మంది రైతులు భూములు ఇచ్చారు, – ఇది కాకుండా ప్రభుత్వ భూములు కలిపి 54 వేల ఎకరాలు ఉంది, 11 ఏళ్లుగా అమరావతికి రూపు లేదు. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు. – 217 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఒక్క కిలోమీటర్ అభివృద్ధి కూడా జరగలేదు, – ఆకాశ హర్మ్యాల్లో ఒక్క భవనం (No Buildings) కట్టలేదు, – 54 వేల ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరిగినట్లు బిల్డప్ ఇస్తున్నారు, సీఎం చంద్రబాబును షర్మిల ఎద్దెవ చేశారు.
అభివృద్ధి ఎక్కడ ?
మొత్తం అభివృద్ధి జరిగి విశ్వనగరం అయినట్లు చెప్తున్నారు, – బెస్ట్ లైవబుల్ సిటీ అయినట్లు కలరింగ్ ఇస్తున్నారు, – అంతా అభివృద్ధి జరిగితే ఇప్పుడు మళ్ళీ భూములు కావాలని ఎందుకు స్కెచ్ వేశారని షర్మిల ప్రశ్నించారు. ఇది ఎంతవరకు న్యాయమో చంద్రబాబు సమాధానం చెప్పాలి. – తీసుకున్న 54 వేల ఎకరాల సంగతి ఏంటి ?, మీరు చెప్పిన అభివృద్ధి ఎక్కడ ?, – ఇప్పుడు రెండో విడత భూములు 16 వేల ఎకరాలు ఎందుకు ?, – రెండో విడతలో (why another exess land) 44 వేల ఎకరాలు ఏం అవసరం వచ్చింది ? అని షర్మిల నిలదీశారు. అమరావతి రైతులను చంద్రబాబు బెదిరిస్తున్నారు, – అమరావతి అంతర్జాతీయ నగరం కావాలంటే రెండో విడత కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మున్సిపల్ సిటీగా అమరావతి కావాలా…గ్లోబల్ సిటీగా కావాలని అడగడం విడూరం, అయ్యా చంద్రబాబు మొదటి విడతలో 54 వేల ఎకరాలు సేకరించినప్పుడు అమరావతి మున్సిపాలిటీ అని తెలియదా ? – 54 వేల ఎకరాల్లో అద్భుత నగరం అన్నప్పుడు మున్సిపాలిటీ అని తెలియదా ? – 54 వేల ఎకరాలు దగ్గర పెట్టుకున్నప్పుడు సింగపూర్, జర్మనీ, న్యూ డిల్లీ అవ్వదు అని తెలియదా ? 54 వేల ఎకరాల్లోనే అన్ని రంగాలకు అమరావతి హబ్ చేస్తా అన్నారు.
బ్లాక్ మెయిల్ చేయొద్దు
ప్రపంచం లోనే గ్లోబల్ సిటీ అన్నప్పుడు మున్సిపాలిటీ అని అర్థం కాలేదా ? – 29 వేల మంది రైతులను మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు. – 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల భూములకు విలువ లేనట్లు మాట్లాడుతున్నారు. – రెండో విడత భూములు ఇవ్వక పోతే.. అమరావతి రాజధాని కాదు అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. – మొదటి దశ భూములకు విలువ ఉండాలి అంటే రెండో విడత ఇవ్వాలి అనడం దుర్మార్గం, అని షర్మిల ఫైర్ అయ్యారు. – రెండో విడత భూములు ఇవ్వకపోతే రాజధాని నిర్మాణం జరగదా ? – 29 వేల మంది రైతులు మిమ్మల్ని ఏమనుకోవాలి ? – రైతులను ఎందుకు మానసిక క్షోభ కి గురి చేస్తున్నారు ? అని – చంద్రబాబు ను షర్మిల సూటిగా ప్రశ్నించారు.
లెక్కలు తేల్చండి
మొదటి విడతలో సేకరించిన 54 వేల ఎకరాల సంగతి ఏంటి ? 54 వేల ఎకరాల భూమిని ఏం చేశారు ? మంత్రి నారాయణ ఈ మధ్య రాజధాని రైతులతో మాట్లాడుతూ, – కేవలం 700 వందల ఎకరాలు మాత్రమే మిగిలింది అని చెప్పారట, – 54 వేల ఎకరాల్లో 700 ఎకరాలు మిగలడం ఏంటి ? 54 వేల ఎకరాల్లో రైతులకు రిటర్నబుల్ ప్లాట్ ల కింద ఎంత ఇచ్చారు ? మౌలిక సదుపాయాల కింద ఎంత భూమి వాడుతున్నారు ? – ఎన్ని కంపెనీలకు భూములు ఇచ్చారు ? – ప్రభుత్వ అవసరాల కోసం ఎంత భూమి వాడుతున్నారు ? భూ కేటాయింపులకు ఎంత ఆదాయం…ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ? – ఈ వివరాలు అన్ని ఎందుకు దాచి పెడుతున్నారు ? – CRDA వెబ్ సైట్ లో ఎందుకు పెట్టడం లేదు ? అని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. అమరావతి తొలిదశ భూములపై శ్వేతపత్రం ఇవ్వాలి, – అఖిలపక్షం ఏర్పాటు చేయాలి, – ప్రతిపక్ష పార్టీలకు అన్ని వివరాలు ఇవ్వాలి, అని షర్మిల డిమాండ్ చేశారు.
ఇంత భూమి అవసరమా?
రెండో విడత భూ సేకరకు ఏపీ కాంగ్రెస్ వ్యతిరేకం, – రెండో విడతలో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కడతారట, – ముంబాయి శివాజీ విమానాశ్రయం కి ఉన్న భూమి 1850 ఎకరాలు, – భోగాపురం ఎయిర్ ఫోర్టు కి 2200 ఎకరాలు, – గన్నవరం ఎయిర్ పోర్టుకి 1250 ఎకరాలు ఉంటే, చంద్రబాబు కి 5 వేల ఎకరాలు ఎందుకు ? అమరావతికి ఇప్పుడు అంత ట్రాఫిక్ ఉందా ? అంత బిజినెస్ ఉందా ? – విజయవాడలో ప్రస్తుతం దిగేవి ATR విమానాలు… అవి బొమ్మల్లా ఉంటాయి. CM , డిప్యూటీ సీఎం పవన్ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు కాబట్టి అర్ధం కాలేదేమో? – గన్నవరం ఎయిర్ పోర్టు విస్తీర్ణం పెంచి అభివృద్ధి చేయొచ్చు. ఉన్న ఎయిర్ పోర్టు ను కాదని… కొత్త ఎయిర్ పోర్టును కట్టడం సబబు కాదు, అని షర్మిల అన్నారు. 2500 ఎకరాల్లో స్పోర్ట్ సిటీ అంటున్నారు, – ప్రపంచ దేశాల్లో ఒలంపిక్స్ నిర్వహించిన బీజింగ్, లండన్ దేశాల్లో చూస్తే 150 ఎకరాల్లో దాటలేదు, – ఇక్కడ స్పోర్ట్ సిటీకి 2500 ఎకరాలు ఎందుకు ? చంద్రబాబు తీరు మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్లు ఉంది. అని షర్మిల సెటైర్ వేశారు.
పెట్టుబడులన్నీ విశాఖకే
రాష్ట్రంలో దేనికి డబ్బు లేదు.. అమరావతికి మాత్రం కోట్లు కోట్లు అంటారు, – అమరావతిలో ఇప్పటి వరకు ఒక్క ఇండస్ట్రీ రాలేదు, – రెండో విడత భూముల్లో స్మార్ట్ సిటీ అంటే ఎవరు నమ్ముతారు ? విశాఖ CII సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులు 13 లక్షల కోట్లు, – ఇందులో 90 శాతం విశాఖలోనే అమరావతికి వచ్చింది కేవలం 5 శాతం పెట్టుబడులే, – 400 mou లు జరిగితే అమరావతిలో పెట్టుబడులకు వచ్చింది 35 mou లు మాత్రమే, – అందరు విశాఖలోనే పెట్టుబడులు పెడుతుంటే..ఇక అమరావతి సంగతి ఏంటి ? అని షర్మిల ప్రశ్నించారు. – అమరావతిని మీరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు ? అమరావతి అభివృద్ధిపై మీకే చిత్తశుద్ధి లేదు, – మిమ్మల్ని నమ్మి ఇచ్చిన రైతులకే నమ్మకం లేదు, రైతులకు భరోసా కల్పించకుండా…రెండో విడత భూములు తీసుకోవడం అన్యాయం, అని షర్మిల నిప్పులు చెరిగారు.
ఈ పొగడ్తలు ఎందుకు
- తొలి విడత భూములు ఇచ్చిన 29 వేల మంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్ లు ఎక్కడో తెలియదు కేవలం రైతులకు ఇచ్చిన ప్లాట్ లు పేపర్లకే పరిమితం అయ్యాయి, – మొదటి విడత రైతులకు న్యాయం చేయని వాళ్ళు..రెండో విడత రైతులకు ఎలా చేస్తారు – మొదటి విడత భూముల్లో అభివృద్ధి కనిపిస్తే…చుట్టుపక్కల భూములకు విలువ పెరుగుతుంది. – అది చేయకుండా ఇప్పుడు ఆ భూములను లాక్కుంటున్నారు – నిజానికి రాజధాని నిర్మాణం కేంద్రం హామీ ఇచ్చింది. – విభజన హక్కు ప్రకారం రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే, – 11 ఏళ్లలో కేంద్రం ఇచ్చింది 15 వందల కోట్లు, – మనకు కేంద్రం ఇచ్చింది చెంబుడు నీళ్లు…తట్టెడు మట్టి – ఈ అన్యాయాన్ని ప్రశ్నించకుండా రాజధాని కోసం అప్పులు చేస్తున్నారు. – నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చారు, – 25 బ్యాంకులకు శంకుస్థాపనలు చేశారు, – ఈ సభ మొత్తం ఒకరినొకరు డబ్బా కొట్టడానికి మాత్రమే వాడుకున్నారు, – రాజధాని కి ఒక్క హామీ రాలేదుచ – కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు పొగుడుతున్నారు సమాధానం చెప్పాలి, అని షర్మిల ప్రశ్నించారు.
ఈ అప్పులు తీరవు
రాజధాని పేరుతో మోసం చేసినం దుకు పొగుడుతున్నారా ? – పోలవరం పేరుతో ఎత్తు తగ్గించినందుకు పొగుడుతున్నారా ? – 54 వేల ఎకరాలు తొలివిడతలో రాజధాని కట్టడానికి 91 వేల కోట్లు కావాలని అన్నారు. రెండో విడత కింద మరో లక్ష కోట్లు అన్నారు. – మొత్తంగా సేకరించిన లక్ష ఎకరాల్లో రాజధాని కట్టాలి అంటే రెండు లక్షల కోట్లు కావాలి, – ఇప్పటికే 26 వేల కోట్లు అప్పులు తెచ్చారు, – మరో 32, 500 కోట్లకు అప్పులకు ఆమోదం తెచ్చుకున్నారు మొత్తంగా ఇప్పటిదాకా 58 వేల కోట్లు అప్పులు తెచ్చారు, – మిగతా అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, – రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అయినప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పు చేస్తున్నారు ? అని సీఎం చంద్రబాబును షర్మిల నిలదీశారు. – సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పి భూములు ఎందుకు అమ్మాలని చూస్తున్నారు , – రాజధాని పేరుతో చేసిన అప్పులు తీర్చలేనివి, – ఎన్ని ఏళ్ళు తీర్చిన ఈ అప్పులు తరగవు అని షర్మిల అన్నారు. –
–
రెండవ విడత భూ సమీకరణ వద్దు
రెండో విడత భూములకు కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నాం, – మొదటి విడత భూముల్లో వెంటనే అభివృద్ధి చేయండి – అఖిల పక్షాన్ని పిలవండి, – అన్ని వివరాలు మా ముందు పెట్టండి – రెండో విడత అవసరం ఎంతో వివరించండి . – వెంటనే శ్వేత పత్రం ఇవ్వండి ఆంధ్రా రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళమే. అంబానీ (For Ambani) , అదానీ ( For Adani) కోసమే మీరు రెండో విడత భూములు సేకరిస్తున్నారు, – మోడీ కోసమే ( For Modi) భూములు ( lands ) సేకరిస్తున్నారు. అమరావతి రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు మళ్ళీ పొడిగించి న్యాయం చేయాలి, – అమరావతి అంటే పండ్లు,కూరగాయలు కాదు అమరావతి అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం అని షర్మిల అన్నారు.

