School | ఉద్యోగానికి రాజీనామా…

School | ఉద్యోగానికి రాజీనామా…
School | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన తునికి ప్రత్యూష(Pratyusha) చెప్పారు. బిక్కనూర్ పట్టణ సర్పంచి స్థానం జనరల్ మహిళ(general woman)కు కేటాయించినందున పలు రాజకీయ పార్టీల మద్దతుతో మహిళలు సర్పంచ్ స్థానం కోసం పెద్ద ఎత్తున పోటీ చేస్తున్నారు.
ఇందులో భాగంగా తునికి ప్రత్యూష దోమకొండ మండల కేంద్రంలో గల కస్తూరిబా పాఠశాల(Kasturba School)లో ఇంగ్లీష్ అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. ఆమె సైతం సర్పంచిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ లేఖను జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు పంపించారు. తమ రాజీనామా లేఖను ఆమోదించాలని ప్రత్యుష కోరారు.
అనంతరం మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు రాజకీయపరంగా సేవ చేయాలన్న సంకల్పంతో తమ ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) మద్దతుతో సర్పంచిగా నామినేషన్ వేయడం జరిగిందని తెలిపారు. ఇంతకుముందు తమ భర్త తునికి వేణు పట్టణ సర్పంచిగా పనిచేశారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితోనే తాను సర్పంచిగా నామినేషన్ వేయడం జరిగిందని చెప్పారు.
