Accident – స్పెయిన్ లో రేసింగ్ – తమిళ హీరో అజిత్ కారుకు ప్రమాదం
స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో తమిళ హీరో, ప్రముఖ కారు రేసర్ అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ముందుగా వెళుతున్న కారును క్రాస్ చేసి వెళ్లే టైమ్ లో ఆ కారును ఢీ కొట్టింది. దీంతో ఫుల్ స్పీడ్ లో వెళుతున్న అజిత్ కారు రేసింగ్ ట్రాక్‌పై పల్టీలు కొట్టింది. ఈ సంఘటన అజిత్ కారులో ఉన్న కెమెరాలో రికార్డ్ అయింది. కాగా ఈ ప్రమాదంలో అజిత్ కు గాయాలేమి కాలేదని అజిత్ కుమార్ రేసింగ్ టీమ్ తెలియజేస్తూ ప్రమాదం సంబంధిత వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసారు.
హీరో తప్పు ఏమీ లేదు, ముందు వెళుతున్న కారు వల్ల ఈ ప్రమాదం జరిగింది అని తెలిపింది. ప్రమాదం జరిగిన కొంత సమయానికి అజిత్ కారు నుండి బయటకు వచ్చి అభిమానులతో ఫొటోలు దిగి, తిరిగి రేస్ కొనసాగిస్తున్నట్లు తెలియజేసారు. ఈ ప్రమాదం నుండి అజిత్ సురక్షితంగా బయటపడడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.