Makthal | 30న పుష్కరిణి ప్రారంభోత్సవం

Makthal | 30న పుష్కరిణి ప్రారంభోత్సవం
పూర్తి కావస్తున్న పనులు పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలసిన శ్రీ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పాడుబడిన దశాబ్దాలనాటి పుష్కరిణి (Pushkarini) (కోనేరు) పుణరుద్దరించడంతో ఈనెల 30న కోనేరు ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Minister Dr. Vakiti Srihari ) చివరి దశకు చేరుకున్న పుష్కరణ సుందరీకరణ పరులు ఏర్పాట్లను పరిశీలించారు.

ఈసందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు స్థానిక నిర్వహికులకు పలు సూచనలు చేశారు. ఈనెల 2 నుండి ప్రారంభం కానున్న శ్రీ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల (Padamati Anjaneyaswamy Brahmotsavam) సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ముందుగా కోనేరులో స్నానమాచరించి స్వామివారి దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కోనేరును వినియోగం ఏవిధంగా ఉండాలి… పుష్కరిణిలో స్నానం వల్ల కలిగే లాభమేంటి అనే విధంగా పుష్కరిణి చుట్టూ స్లొగన్స్ రాసి పెట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్, నాయకులు పూజా శివరాజ్, హేమ సుందర్, వల్లంపల్లి లక్ష్మణ్, కావలి శ్రీనివాసులు, సిఐ రామ్ లాల్ ,ఎస్సై 2 ఆచారి, ఎండోమెంట్ సిబ్బంది శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.
