WORKER | పెద్దపల్లిలో ప్రమాదం…

WORKER | పెద్దపల్లిలో ప్రమాదం…

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో ఎన్ టి పి సి కార్మికుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా (Peddapally district) అందుగులపల్లి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. అందుగులపల్లి గ్రామానికి చెందిన పిడుగు గోపాల్ ఎన్ టి పి సి లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనక నుండి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply