Chemical Ice Cream | భీమవరంలో చెలగాటం…

Chemical Ice Cream | భీమవరంలో చెలగాటం…
- విజిలెన్ప్ తనిఖీల్లో బాగోతం బట్టబయలు
- రెండు కేసులు నమోదు..
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే వాటిల్లో ఐస్ క్రీమ్ (Ice Cream) కు ప్రథమ స్థానం ఉంటుంది. అటువంటి ఐస్ క్రీమ్ తయారీలో నాసిరకమైన రసాయనాలు, ఫ్లేవర్స్ ఉపయోగిస్తున్నారని సమాచారంతో అధికారులు మంగళవారం తనిఖీలు (Inspections) చేపట్టారు. భీమవరం ఇండస్ట్రీయల్ ఏరియా(Bhimavaram Industrial Area
)లో బ్లూ బెర్రీ సూర్యతేజ ఫుడ్స్ కంపెనీపై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు.
ఈ తయారీ కేంద్రంలో అధికారులు ఐస్ క్రీమ్స్ తయారీ కోసం ఉపయోగించే కాలం చెల్లిన ఫుడ్ ఫ్లేవర్(Food flavor) లను గుర్తించారు. కాలం చెల్లిన రసాయనాలు, ప్లేయర్స్ తో ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్స్ లను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఐస్ క్రీంలు తయారు చేస్తున్న పరికరాలు, సరుకులను క్షుణ్ణంగా పరిశీలించారు.
తయారు చేసే ప్రాంతం కూడా అపరిశుభ్రంగా ఉండటం, కనీస నిబంధనలను పాటించటం లేనట్లు అధికారులు గుర్తించారు. ఐస్ క్రీం తయారీకి ఉపయోగించే లిక్విడ్, ఫ్లేవర్ లను గుర్తించారు. 2023తో కాలం చెల్లిన ఫ్లేవర్స్, మిల్క్ క్రీమ్ లను గుర్తించతో ఇక్కడ తయారు చేసిన ఐస్ క్రీమ్ నమూనాలను సేకరించారు.
సేకరించిన నమూనాలను పరీక్షలు (Tests) నిమిత్తం హైదరాబాదులో ల్యాబ్ కు పంపిస్తామని అధికారులు తెలిపారు. విజిలెన్స్ ఎస్పీ కె.నాగేశ్వరావు ఆదేశాలతో ఈ తనిఖీలు చేపట్టమని విజిలెన్స్ ఎస్సై కే సీతారాము తెలిపారు. ఈ తనిఖీల్లో తూనికలు కొలతల అధికారి వి.మోహనరావు, ఆహార తనిఖీ అధికారి శ్రీరామిరెడ్డి పాల్గొన్నారు.
Chemical Ice Cream | రెండు కేసులు నమోదు..
భీమవరం ఇండస్ట్రీయల్ ఏరియాలో బ్లూ బెర్రీ సూర్యతేజ ఫుడ్స్ కంపెనీపై రెండు కేసులను ఈ తనిఖీలు సందర్భంగా నమోదు చేసినట్లు తనిఖీ అధికారులు తెలిపారు. ఈ కంపెనీలో కాలం చెల్లిన కెమికల్స్, ఫ్లేవర్స్, మిల్క్ క్రీమ్ ఉండటం పై ఒక కేసు, ఐస్ క్రీమ్ తయారీకి సంబంధించి బరువులు తేడాలు ఉండటం పై తూనికలు కొలతలు శాఖ అధికారులు మరొక కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. లాబ్ రిపోర్టులు ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
