Under 14 | వాలీ బాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక.

Under 14 | వాలీ బాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక.

Under 14 | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్ పోటీలకు ఎంపికై పలువురి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి రమేష్ అండర్ 14(Under 14) వాలీబాల్ విభాగం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల పీడి సాయినాథ్ తెలిపారు.

రాష్ట్రస్థాయి అండర్ 14 వాలీబాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థి రాష్ట్రస్థాయిలో ఈనెల 26 నుండి 28 వరకు నిర్వహించనున్న వాలీబాల్ పోటీ(Volleyball competitions)ల్లో పాల్గొనేందుకు ఎంపికైనట్లు తెలిపారు. గద్వాల్ జిల్లాలో నిర్వహించిన పోటీల్లో తన ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంతో మంగళవారం పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మురళిధర్, పిడి సాయినాథ్ అభినందించి సన్మానించారు. రాష్ట్రస్థాయి అండర్ 14లో ప్రతిభ కనబరిచి ఊట్కూర్ మండల కేంద్రానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని సూచించారు. విద్యార్థి ఎంపిక పట్ల క్రీడాకారులు ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూఅభినందించారు.

Leave a Reply