15 years | స్వదేశానికి తిరిగి వచ్చిన ఈశ్వర్

15 years | స్వదేశానికి తిరిగి వచ్చిన ఈశ్వర్

15 years | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కువైట్ నుంచి స్వదేశానికి భుక్య ఈశ్వర్ ఈ రోజు ఎట్టకేలకు తిరిగి వచ్చాడు. కమ్మర్ పల్లి మండలం హాస కొత్తూరు గ్రామానికి చెందిన భుక్య ఈశ్వర్ 15 సంవత్సరాల(15 years) నుంచి బతుకు తెరువు కోసం కువైట్ దేశంలో పని చేసుకుంటూ 2,3 సంవత్సరాలకు ఒకసారి స్వదేశానికి వచ్చి వెళ్లేవాడు.

అలాగే ఈసారి కూడా దేశం వస్తున్నానని ఈశ్వర్ తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆనాటి నుండి అతని ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు అయోమయానికి గుర‌య్యారు. భుక్య సుగుణ తన భర్త ఫోన్ కలవడం లేదని, తన భర్త ఆచూకీ కనుగొని కువైట్ నుండి రప్పించాలని, అదే గ్రామానికి చెందిన స్థానిక కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకువెళ్లగా ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి(Mutyala Sunil Kumar Reddy)ని నాయకులతో కలిసి వెళ్ళి విన్నవించింది.

ఈశ్వర్ కుటుంబ సభ్యులను కిసాన్ కాంగ్రెస్(Kisan Congress) జిల్లా ఉపాధ్యక్షుడు పడిగేల ప్రవీణ్ హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ప్రవాసి ప్రజావాణిలో ఇన్చార్జిగా ఉన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, రాష్ట్ర గల్ఫ్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి(Manda Bheem Reddy)లను, ప్రభుత్వ అధికారులను కలిసి సుగుణ తన గోడును విన్నవించింది.

వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కువైట్ లో ఉన్న ఇండియ ఎంబస్సి అధికారులతో మాట్లాడి కువైట్(Kuwait) దేశంలో పోలీసుల చెరలో ఉన్న ఈశ్వర్ ఆచూకీని కనుగొని స్వదేశానికి రప్పించారు. తన భర్త ఇంటికి చేరడానికి కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాయకులకు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.

Leave a Reply