Midday meals | పకడ్బందీగా మధ్యాహ్న భోజనం పథకం

Midday meals | పకడ్బందీగా మధ్యాహ్న భోజనం పథకం
Midday meals | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ (Video conference hall) ళక్ష జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ మధ్యాహ్న బడి భోజన పథకంపై సంబంధిత అధికారులతో స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలందరూ ఇష్టపడి 100 శాతం భోజనం చేసేలా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అమలు చేయాలన్నారు. జిల్లాలో పోషకాహార లోపాన్ని నివారించడానికి, బడికి వస్తున్న పిల్లల సంఖ్యను పెంచేందుకు, పిల్లల మధ్య సామాజిక బంధాలను మెరుగుపరిచేందుకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అమలు చేస్తున్నామన్నారు.
ఈ పథకంలో ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలన్నారు. కొన్నిచోట్ల విద్యార్థులు భోజనం చేయకుండా ఇళ్లకు వెళ్లిపోతున్నారని.. అలా కాకుండా ప్రతి విద్యార్థి భోజనం చేసేటట్లుగా చూడాలన్నారు. కోడిగుడ్లు (Chicken eggs) సకాలంలో పాఠశాలలకు సరఫరా చేసేటట్లు చూడాలని గుడ్లు సరఫరాలో సమస్యలు లేకుండా డ్యామేజ్ ఉన్న, అన్సైజ్ గుడ్లను వెనక్కి పంపించాలన్నారు. విద్యార్థులకు మంచి పోషకాహారాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలన్నారు. సోమవారం నుండి శనివారం వరకు మెనూలో పెట్టే వివిధ ఆహార పదార్థాలపై జాయింట్ కలెక్టర్ కూలంకషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈవో జనార్దన్ రెడ్డి, ఎంఈఓ లు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

