WOMEN | చీరల పంపిణీ..

WOMEN | చీరల పంపిణీ..
WOMEN | మునుగోడు, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం ఇందిర మహిళ శక్తి (Woman power) కార్యక్రమం. ఇందులో భాగంగా ఇందిర మహిళ శక్తి చీరల పంపిణీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం జరిగింది. మండలంలోని రత్తిపల్లి గ్రామంలో ఈరోజు మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్ (Madhagoni Rajesh Goud) ఆడపడుచులకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, గ్రామ సంఘ బంధం అధ్యక్షురాలు జ్యోత్స్న, వీవోఏ సుజాత, రేషన్ డీలర్ రామచంద్రం, ఫీల్డ్ అసిస్టెంట్ సుదర్శన్, అంగన్వాడి టీచర్ మంగమ్మ, రాసమల్ల వెంకన్న, చోల్లేటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
