MOVIE | పూరి, విజయ్ సేతుపతి మూవీ ఎప్పుడు..?

MOVIE | పూరి, విజయ్ సేతుపతి మూవీ ఎప్పుడు..?


MOVIE | హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటే ఠక్కున గుర్తొచ్చేది పూరి జగన్నాథ్. ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్స్ అందించారు. ఇటీవల వరుసగా ప్లాప్ మూవీస్ (Plop Movies) అందించారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ అంటూ వరుసగా రెండు డిజాస్టర్స్ అందివ్వడంతో.. నెక్ట్స్ మూవీ కోసం పూరి చాలా హార్డ్ వర్క్ అండ్ హోమ్ వర్క్ చేయాల్సి వచ్చింది. టాలీవుడ్ లో కొంత మంది హీరోలకు కథలు చెప్పినా సెట్ కాలేదు. ఆఖరికి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో పూరి మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇంత వరకు చేయలేదు. ఈ మూవీ ఎంత వరకు అయ్యింది..? థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు…?

పూరి గురించి తెలిసిందే.. చాలా స్పీడుగా సినిమాలు చేస్తుంటారు. షూటింగ్ స్టార్ట్ చేసిన రోజునే.. రిలీజ్ డేట్ అనౌన్స్ (Release date announcement) చేయడం పూరి స్టైల్. అయితే.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో వరుసగా డిజాస్టర్స్ ఇవ్వడంతో ప్రస్తుతం చేస్తున్న సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. కథ పై చాన్నాళ్లు కసరత్తు చేశారు. ఆమధ్య ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయాలి అనుకున్నారు. అయితే.. కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యింది. త్వరలోనే ఈ మూవీ టైటిల్ ను ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీగా అంచనాలు ఉన్నాయి.

ఇంతకీ.. ఈ మూవీ అప్ డేట్ ఏంటంటే.. టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. పాటలు చిత్రీకరించాల్సి వుందని అఫిషియల్ గా ఈరోజు అనౌన్స్ చేశారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటి టబు నెగిటీవ్ షేడ్ ఉన్న పాత్ర పోషిస్తుందని సమాచారం. ఈ సినిమాకి స్లమ్ డాగ్ అనే టైటిల్ కన్ ఫర్మ్ చేసారని తెలిసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ భారీ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో టైటిల్ అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. అయితే.. ఈ సినిమా పై పూరి చాలా ఆశలు పెట్టుకున్నారు. వరుసగా ప్లాపులు రావడంతో ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాల్సిన పరిస్థితి. సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. పూరి ఈ మూవీతో బిగ్గెస్ట్ హిట్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

Leave a Reply