College | విద్యార్ధుల ధర్నా…

College |విద్యార్ధుల ధర్నా…
College |ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా హర్షా కాంప్లెక్స్‌లో ఉన్న శ్రీ చైతన్య కాలేజ్‌లో సోమవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. కాలేజ్ హాస్టల్ లో భోజనం నాణ్యత బాగా లేదంటూ విద్యార్ధులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. విద్యార్థుల చెప్పిన సమాచారం ప్రకారం.. గత కొన్ని నెలలుగా క్యాంటిన్‌లో భోజనం రుచిగా ఉండకపోవడం, తరచూ చల్లగా పెట్టడం, శుభ్రత లోపించడం పై పలుసార్లు ఫిర్యాదు చేసినా, కాలేజ్ యాజమాన్యం స్పందించలేదని ఆరోపించారు. పొంగల్‌లో రాళ్లు వస్తున్నాయి.. కూరల్లో పురుగులు వస్తున్నాయి.. అన్నం సరిగా ఉడకడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు అంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల పై స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.
