TEMPLE | ఆలయం కోసం..

ఆంజనేయ స్వామివారి ఆలయ నిర్మాణానికి తొలి అడుగు

TEMPLE | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మండలం, దర్శన్ గడ్డ తండాలో ఆంజనేయ స్వామివారి ఆలయ నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తదనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా ₹5 లక్షల రూపాయలు అందజేశారు. అవసరమైతే మరిన్ని నిధుల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి మరింత సాయం అందేలా ప్రభుత్వ సహాయం పై కూడా చర్చించనున్నట్లు తెలిపారు.

“ఆంజనేయ స్వామివారి ఆశీస్సులతో ఈ గ్రామం, మొత్తం నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. గుడి నిర్మాణం పూర్తి కావడంతో ఆధ్యాత్మిక వాతావరణం మరింత బలపడుతుంది,” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ రామనాథం, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply