SHABARI | అయ్యప్ప దీక్ష చేస్తే..

48 రోజులు ఎంతో కఠోరమైన భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షలను చేపట్టి

SHABARI | .ఊట్కూర్, ఆంధ్రప్రభ : హరిహర పుత్రుడు శబరి కొండ వాసుడు శ్రీ అయ్యప్ప స్వామి మాలధారణ చేపట్టిన స్వాములు దీక్ష నియమనిష్టలతో చేపట్టాలని గురుస్వామి మేకల భగవంతు అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీశ్రీ శబరిపీఠం శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో పలువురు మొగ్ధంపూర్, అయ్యప్పస్వాములు చేపట్టారు.

ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ.. మానవులంతా భక్తి మార్గంలో నడవాలని, మనసులంతా భక్తి మార్గంలో నడిచి అందరూ సమానమేనని చాటి చెప్పే బాధ్యత మానవాళి పై ఉందని సూచించారు. 48 రోజులు ఎంతో కఠోరమైన భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షలను చేపట్టి వారి కుటుంబ సభ్యులకు, గ్రామానికి మంచి జరగాలని అయ్యప్ప మాల ధారణ తీసుకుంటారని అన్నారు. మండల కేంద్రంలోని శివాలయంలో రఘువీర్ గురుస్వామి నలుగురికి అయ్యప్ప మాలధారణ చేశారు.

అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులకు మండల కేంద్రంలోని పాతపేట వీధిలో అయ్యప్ప మాలధారణ స్వామిబలరాం ఇంటిలో అన్న ప్రసాదం వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో గురు స్వాములు శంకర్, తమ్మారెడ్డి, భానుచందర్, ముద్దంరాము, ముద్దంసునీల్ ,సందీప్,వెంకటేష్, మోనేష్,గౌడ్, బాలాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply