Utnoor | పగడ్బందీగా అమలు చేయాలి
డి డి అంబాజీ జాదవ్
Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : గిరిజన సంక్షేమ శాఖ (Tribal Welfare Department) ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వందరోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయాలని ఉట్నూర్ గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ జాదవ్ (Ambaji Jadhav) అన్నారు. ఆయన ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్షెట్ పేట ఆశ్రమోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల ప్రార్థన సమయంలో పాల్గొని పాఠశాల ఉపాధ్యాయుల రిజిస్టర్ లను వంటగదిలను సౌకర్యాలను పరిశీలించారు.
తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థులకు (students) పలు ప్రశ్నలు వేసి భోజన అంశాలను పరిశీలించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పాఠశాలలో ఏడాది పదవ తరగతిలో 100% ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు (Teachers) సమయవేళలు పాటించాలని, సకాలంలో సిలబస్ లు పూర్తయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు. మెనూ పట్టిక ప్రకారం విద్యార్థులకు భోజన వసతి కల్పించాలని ఆయన వార్డెన్ జాదవ్ మధుసూదన్, ప్రధానోపాధ్యాయులను కోరారు. పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు వారి ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, చౌహన్ రమేష్, వార్డెన్ జాదవ్ మధుసూదన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

