integrated school | రూ.200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం

- డిసెంబర్ 1న భూమి పూజ
- హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
integrated school | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులకు వచ్చే నెల డిసెంబర్ 1న భూమి పూజ చేపట్టనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు. భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. అందులో భాగంగా నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పనులను చేపడుతున్న మన్నారు. 200 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులతో విద్యార్థులకు అవసరమైన చదువు, క్రీడలు అన్ని సదుపాయాలు అక్కడే అందుబాటులో ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని విద్యాహబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, తహసీల్దార్ సతీష్ కుమార్, మాజీ జెడ్పీటీసీ జి.లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ కుమార్ గుప్తా, కోళ్ల వెంకటేష్, కావాలి ఆంజనేయులు, పూజ శివ కుమార్ తదితరులు ఉన్నారు.
