Sabarimala | అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం
Sabarimala | మక్తల్, ఆంధ్రప్రభ : శబరిమల వాసుడు శ్రీ మణికంఠుడు అయ్యప్ప స్వామిని నారాయణ పేట జిల్లా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Rammohan Reddy) దర్శించుకున్నారు. శుక్రవారం రోజు ఆయన కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో అయ్యప్ప కొండపై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అయ్యప్ప స్వామి దర్శనంతో జన్మ ధన్యమైంది అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ (Telangana) తో పాటు మక్తల్ నియోజకవర్గ ప్రజల సుభిక్షంగా ఉండాలని ప్రాంతం అభివృద్ధి కోసం అయ్యప్ప స్వామిని వేడుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మిజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వెంబడి బీఆర్ఎస్ (BRS) నాయకులు రిటైర్డ్ ఎస్ఎల్డీసి ప్రిన్సిపల్ కె.సుదర్శన్ రెడ్డి, నాయకులు గార్లపల్లి నరసింహారెడ్డి, ఈశ్వర్ యాదవ్ తదితరులు ఉన్నారు.

