EYE CAMP | కంటి చూపుపై జాగ్రత్తలు అవ‌స‌రం

ఉచిత కంటి చూపు పరీక్షా శిబిరాన్ని ప్రారంభించిన ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్

EYE CAMP | ఏలూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో : ఏలూరు అమీనా పేటలో ఉన్న సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం నేత్ర సంరక్షణ, వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఏలూరు రేంజ్ ఐజీ జివిజి అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ, అన్ని అవయవాల కెల్లా కంటి చూపుకు ప్రాధాన్యత ఉందని, విద్యార్థి దశ నుంచే కంటి చూపు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో అతిథి గా పాల్గొన్న ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ, కంటి సంరక్షణ కార్యక్రమాన్ని సానా సతీష్ ఫౌండేషన్ పోలీస్ స్కూల్లో నిర్వహించడం చాలా అభినంద‌నీయ‌మ‌న్నారు. ప్రతి ఒక్కరికి కంటి చూపు ఎంతో అవసరమన్నారు. జిల్లా ఎస్పీ 8వ తరగతి చదువుతుండగా తన యొక్క కంటి చూపును చూపించు కోవడం వలన అద్దాలు ఉప‌యోగించాన‌ని, దాని వలన చదువులో ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉంద‌న్నారు. పోలీస్ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు పేద మధ్య తరగతి వారు అని గ్రహించి సానా సతీష్ ఫౌండేషన్ వారి కోసం ఉచిత శిబిరం ఏర్పాటు చేశార‌న్నారు. విద్యార్థులు ముఖ్యంగా సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని, మనిషి యొక్క ఆస్తి అంటేనే శరీర భాగాలని, కోట్లు సంపాదించిన శరీర భాగాలు పోతే అవి తిరిగి పొందలేమన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, సర్వేంద్రియానం నయనం ప్రధానం అని, కంటి చూపును కోల్పోతే ప్రపంచాన్ని ఏమీ చూడలేమని, ప్రపంచంలో ఉండే విశేషాలను గ్రహించలేరన్నారు. విద్యార్థి దశ నుంచి కంటి చూపు పై దృష్టి పెడితే ఇబ్బంది ఉండ‌ద‌న్నారు. సానా సతీష్ ఫౌండేషన్ ఇటు వంటి కార్యక్రమాన్ని జిల్లా లోని అన్ని విద్యా సంస్థలలో నిర్వహించడం అంటే ఎంతో అభినందించదగిన విషయమని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్‌స్పెక్ట‌ర్ మల్లేశ్వర రావు, ఆర్‌ఐ ఏఆర్ సతీష్, ఏలూరు త్రీ టౌన్ ఇన్‌స్పెక్ట‌ర్ కోటేశ్వరరావు, సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ స్రవంతి, ఆర్ఎస్ఐ నరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు

Leave a Reply