What Next Jagan : వాట్ నెక్ట్స్ జగన్
- ఇటు సీబీఐ పద్మవ్యూహం
- అటు వైసీపీ కేడర్ లో అలజడి
- వారసత్వంపైనే చర్చ
- రబ్రీదేవీ పాత్రలో అర్ధాంగి భారతి
- ఏపీలో పల్లె పల్లెలో ఇదే చర్చ
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి )
పౌరుషాల గడ్డ.. కడప వైఎస్ఆర్ బిడ్డ..ఏపీ వైసీపీ సామ్రాట్ వైఎస్ జగన్ పొలిటికల్ వపర్ వార్ లో గిజగిజలాడుతున్నారు. క్విడ్ ప్రో కో (Quid Pro Quo) , అక్రమాస్తుల కేసుల ( Disproportionate Assets – DA ) నేపథ్యంలో .. సీబీఐ బోనులో చిక్కుకుని డిఫెన్స్ లో పడ్డారు. ఈ కేసుల్లో నిర్దోషిగా బయటకు వస్తే పర్వాలేదు. దోషిగా జైలుకు వెళ్తే ..భవిష్యత్తు ఏమిటీ (What Next) ? వైసీపీ అధినేత బలగంలో కీలక మంత్రాంగ కర్తలు సైతం ఊచలు లెక్కపెట్టక తప్పదు.

ఎందుకంటే.. జగన్ పై ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఇటు సీబీఐ (CBI), అటు ఈడీ (ED) ప్రయోగించిన చార్జిషీట్ల నుంచి నిందితులను తప్పించటం డిఫెన్స్ లాయర్లకు ఆషామాషీ కాదు. ఇవన్నీ అక్రమ కేసులేనని (Created Casess) సీబీఐ కోర్టు తేల్చే వరకూ.. వైసీపీలో ఈ ఆందోళన తప్పదు. ఈ స్థితిలోనే వాట్ నెక్ట్స్ (What Next) అనే అంశంపై వైసీపీ రథులు, అతిరథులు, సామాంతుల గుండెల్లో గుబులు రగిలింది. బీహార్ జంగిల్ రాజా ( Bihar Jangle Raja) లాలూ ప్రసాద్ యాదవ్ జైలు జీవితం (Jail Life Story) కథ..
ఏపీలోనూ ప్రారంభమైతే .. ఏం చేయాలి? రబ్రీ దేవీ (Radri Devi) పాత్రను వైఎస్ భారతికి (YS Bharathi) ఇవ్వాలా ? లేకపోతే ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగించాలి? (What Next Future ?) భవిష్యత్తు ప్రణాళిక ఏమిటీ? ప్రస్తుతం ఏపీలోని పల్లెపల్లెల్లో వైసీపీ జనంలో అంతర్మథనం జరుగుతోంది. ఈ పొలిటికల్ సినారియోలో .. ఆసక్తికర అంశాలను పరిశీలిద్దాం.
What Next Jaganరాజకీయాల్లో నయా ప్లాన్లు
రాజకీయం అంటే.. అధికారమే అంతిమ లక్ష్యం. శత్రువును బలహీన పరిస్తేనే గెలుస్తాం. దర్బారులో దర్పంగా సింహాసంపై కూర్చుంటాం. ఈ సూక్తి , స్పూర్తి ఈ నాటిది కాదు. సామ్రాట్టుల కాలంలోనే పురుడు పోసుకుంది. రాజ్యాలపై రాజ్యాలు దండయాత్రలు.. అశ్వమేథాయాగాలకు పురికొల్పింది. ఆ కలికాలం అంతరించింది.
నవీన యుగంలో రాచరికం పోయింది. ప్రజాస్వామ్యం (Democracy) వచ్చింది. ప్రజానేతల రాజకీయాలు తెరమీదకు (Politics) వచ్చాయి. కొత్త కొత్త తరాలు సరికొత్త వ్యూహాలతో రాజకీయాలు చేస్తున్నాయి. నిజంగా రాచరికం వ్యూహాల్లో పుట్టిన ఇప్పటి పాలిటిక్స్ రూటే సపరేటే. ఇప్పుడు భౌతిక దాడులు లేదు. ఫ్యాక్షనిజం (Factionsim) కనిపించటం లేదు.
ఉన్నది ఒకటే అస్త్రం. కేసుల మిసైల్స్ సంధిస్తున్నారు. ఇంకేముందీ… ఈ కేసుల్లో ఇరుక్కున్న నేతలందరూ జైలు జీవితం గడపక తప్ప లేదు. అందుకే రాజకీయ వారసులు Political Successors) రంగంలోకి దిగుతున్నారు. సరీగా ఇదే సీన్ ఏపీ పాలిటిక్స్ లోనూ కలకలం రేపుతోంది. కేవలం పార్టీ అధినేతలే కాదు. సామంతుల వారసులు సైతం రాజకీయాల్లో నయా స్టార్లుగా తెరమీదకు వస్తున్నారు.
What Next Jaganకేసు వెఫన్ ..
భారత రాజకీయాల్లో కేసుల అస్త్రాన్ని (Criminal Cases Wepon) కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సంధించింది. బీహార్ లో పశుగ్రాసం కుంభకోణాన్ని(Podder scam) పాట్నా హైకోర్టు వెలుగులోకి తీసుకు వచ్చింది. సీబీఐని రంగంలోకి దించింది. అది మొదలు.. బీహార్ లో లాలూ ప్రసాద్ (Lalu Prasad Yadav) జమానాకు అంతిమ యాత్ర ప్రారంభమైంది.

సీబీఐ ప్రయోగించిన స్కామ్ అస్త్రాలన్నీ ఫలించాయి. మొత్తం ఐదు కేసుల్లో (5 Casess) 24 ఏళ్లు జైలు (24 Years Jail Conviction) శిక్షపడింది. 2013లో లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా కోర్టు నిర్ధారించింది. తన పరపతితో చట్టంలో వెసులు బాటులను లాలూ ప్రసాద్ యాదవ్ వినియోగించుకున్నారు.
2017 డిసెంబర్ నుంచి 2022 వరకు ఝార్ఖండ్ రాంచీ (Ranchi) లోని బీర్సా ముండా జైలు (Birsa Munda jail) , రాంచీలోని హాట్వార్ జైలు (Hatwar Jail) లో 54 నెలలు (54 Months) శిక్ష అనుభవించారు. ఆరోగ్య సమస్యలతో RIMS, AIIMS) జైలు జీవితం గడిపారు. 2021,, -2022లో ఝార్ఖండ్ హైకోర్టు , సుప్రీం కోర్టు నుంచి బెయిల్ పొందారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు (Dis QualiFied) అనర్హుడయ్యారు.
ఇక లిక్కర్ కుంభకోణాల్లో (Liquar Scam) ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwak), తెలంగాణ ఆడబిడ్డ జన జాగృతి అధినేత్రి కల్వగుంట్ల కవిత (Kalvaguntla Kavitha) కూడా జైలు జీవితం గడిపారు. ఇంకా ఈ కేసుల విచారణ పూర్తి కాలేదు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు.
ఇక ఏపీలో వైసీపీ అధినేత (YCP Cheaf) వైఎస్ జగన్ పై అక్రమాస్తులు, అక్రమార్జన కేసులో ఢిపరెంట్. ఏకంగా 11 చార్జిషీటులు 11 Charge Sheets) , 9 ఈడీ స్టేట్ మెంట్లు ( 9 ED Casess) సీబీఐ కోర్టులో ఉన్నాయి. వీటిన్నటిపై గత ఆరేళ్లుగా విచారణ జరగలేదు. తాజాగా సీబీఐ కోర్టు దూకుడు పెంచింది. ఎన్ని వాయిదాలకు అవకాశం ఉన్నా.. ఈ కేసు తుది తీర్పు రావటం ఖాయం. ఏడాది పడుతుందా? మరో రెండేళ్లు పడుతుందో వేచి చూడాల్సిందే. రాబోయే జమిలి ఎన్నికల (2027) లోపు ఈ కేసు విచారణ పూర్తి కావటం తథ్యం, అని పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
What Next Jaganఏపీలో వైసీపీ ప్లాన్ పైనే చర్చ..

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని ( YSR Successor) తనకు ఇవ్వలేదనే ఏపీ రాజకీయ వేదికపైకి వైసీపీని జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తీసుకు వచ్చారు. తమను వ్యతిరేకించాడనే ఆగ్రహంతో కాంగ్రెస్ అధిష్టానం.. ఈ క్విడ్ ప్రో కో (Quid Pro Quo) ను తెరమీదకు తీసుకువచ్చిందనేది వైసీపీ వర్గాల ఆరోపణ.

తమ అధినేత వైఎస్ జగన్ పై అక్రమ కేసులు పెట్టారని ఇప్పటికీ ఆయన అభిమానులు నమ్ముతున్నారు. కానీ.. ఏపీలో వైసీపీకి ప్రధాన శత్రువు టీడీపీ (TDP). ఈ పార్టీ కూడా హైకోర్టు విచారణలో ఇంప్లీడ్ (Implead) అయింది. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయటమే టీడీపీ లక్ష్యం. ఇందులో ఎలాంటి అనుమానాలకు అవసరం లేదు. ఇక తన అనుచర గ్యాంగ్ విచ్చలవిడితనం కూడా వైసీపీ అధినేత జగన్ ప్యూచర్ ను దెబ్బతీశాయని రాజకీయ పరిశీలకులు వాదిస్తున్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (TDP Cheaf ) భార్యను, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) సతీమణిని అవమానించారు. ఈ వ్యవహారమే.. జగన్ పై ప్రతిపక్షాల్లో తీవ్ర వ్యతిరేకత పెంచిందని ఏపీ జనం వాదన.
What Next Jaganవాట్ నెక్ట్స్ ..

అధినేత జగన్ మోహన్ రెడ్డే.. ఏపీ వైసీపీ సర్వాధికారి. ఒకవేళ.. క్విడ్ ప్రో కో కేసులో.. జైలు శిక్ష పడితే.. సుప్రీం కోర్టు నిర్ణయం కోసం మరో న్యాయ పోరాటం తప్పదు. సుప్రీం కోర్టులో నిర్దోషి బయటకు రావటం ఒక మార్గం కాగా.. బెయిల్ పై రాజకీయ స్వేచ్ఛ (Political Freedom) పొందటం మరో మార్గం.
సో.. పొలిటికల్ డయాస్ లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే మళ్లీ జైలుకు వెళ్తే జనం సానుభూతి ( Sympathy) లభించవచ్చు.. లేదా తిరస్కరణ (Rejoction) ఎదురు కావొచ్చు. ఇక పార్టీ పగ్గాలను తన కుటుంబ సభ్యులకు తప్పా మరో నేతకు అప్పగించటానికి వైసీపీ అధినేత కాదు.. ఫ్యామిలీ కూడా ఒప్పుకోదు.

ఇప్పటికే అమ్మను, చెల్లిని రాజకీయాల్లో దూరం చేసిన జగన్ .. పార్టీలో ఇతర నాయకులకు పగ్గాలు ఇవ్వరు. ఇవ్వలేరు. ఇదీ రాజకీయ పరిశీలకుల వాదన. బొత్స సత్యనారాయణకు (Botsa Satyanarana) అవకాశం ఉన్నా.. వీలుపడదు. ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) కూడా వాన్ పిక్ (VanPic) కేసులో కీలక నిందితుడు. ఇక అంతరంగీకులు వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy) పరిస్థితి బాగోలేదు. వివేకానంద హత్య (Vivekananda Murder Case) కేసు వెంటపడుతోంది.
సజ్గజ రామకృష్ణారెడ్డికి ఛాన్సే లేదు. విజయ సాయి రెడ్డి అనధికార అవ్రూవర్ గా మారారు. ఈ స్థితిలో.. వైఎస్ అర్ధాంగి భారతి (Ys Bharathi) నే వారసురాలిగా (Successor) ప్రకటించాలి. ఏదోక విషయాన్ని త్వరగా ప్రకటించాలని వైసీపీ కేడర్ ఎదురు చైస్తున్న మాట నిజం.. నిజం.

