ACCIDENT| కొడవలూరు, ఆంధ్రప్రభ : కొడవలూరు మండలం కమ్మ పాలెం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గీతాంజలి ఇంజనీరింగ్ విద్యార్థులైన అన్వర్ భాష, రంగనాథ్ కారులో బోగోల్లో ఒక కార్యక్రమానికి హాజరై నెల్లూరుకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న టిప్పర్ ను కారు ఢీ కొనడంతో అన్వర్ భాష అక్కడికక్కడే మృతి చెందాడు. రంగనాథ్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై కోటిరెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ACCIDENT| రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

