Again Cyclone వామ్మో.. మళ్లీ తుపాన్
- మబ్బులొచ్చాయ్
- టార్ఫలిన్లు ల్లేవ్
- ఆఫీసర్ల దగ్గర పైసల్లేవ్
- మంత్రుల హామీలు వైరల్
- రైతులు గగ్గోలు ..
- ఇదీ కృష్ణాజిల్లా వ్యథ
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ స్రతినిధి )
ముంథా తుపాను నిండా ముంచేసింది. పొలాల్లో వరి వెన్ను విరిగింది. రైతన్న బిక్కడిక్కపోయాడు. పంట నష్టం అంచనాల్లో అధికారులు పొలాల దగ్గరకు వెళ్లేదు. ఆర్డీకేల్లో కూర్చోని లెక్కలు కట్టారు. మళ్లీ తుపాను (Again Cyclone ) కబురు వచ్చింది. అప్పుడే మబ్బులు కమ్మేశాయి. చేతికి అందిన పంటను కోసుకుని ధాన్యాన్ని రోడ్డుకు చేర్చుకుంటే.. అప్పుడే ఆకాశంలో మబ్బులు కమ్మేశాయి. ఇక రైతులు లబోదిబోమంటూ టార్ఫాలిన్ ల కోసం ఆఫీసర్ల దగ్గరకు వెళ్తే.. వీఆర్వోను కలవమంటున్నారు.
వీఆర్వో ఏమో.. ( No టార్ఫాలిన్ లా .. ప్రొవిజన్ లేదే,, అంటున్నారు. రైతుల పంట కాపాడటానికి ఉచితంగా లార్ఫాలిన్ లు ఇస్తున్నామని .. ఇటు పౌరసరఫరాల శాఖ మంత్రి.. అటు వ్యవసాయ శాఖ మంత్రి హామీలు మీద హామీలు ఇస్తున్నారు. చేతిలో పైపా లేదు.. లార్ఫాలిన్ లు ఎక్కడి నుంచి తేవాలి, అని అధికారులు కోపగించుకుంటున్నారు. ఇదీ కృష్ణాజిల్లాలో బందరు మండలం పొట్లపాలెం, గోగినేనివారి పాలెం, పెడన, గుడివాడ, కృత్తివెన్ను మండలాల్లోని రైతుల వ్యథ.. అధికారుల వ్యవహారం… అయ్యా కలెక్టర్జీ కాస్త చలించు.. మహారాజా అని రైతులు మొత్తుకుంటున్నారు.

