3 Belt Shops | తనిఖీల్లో బగ్గుమన్న బెల్ట్ షాపులు..!

3 Belt Shops | తనిఖీల్లో బగ్గుమన్న బెల్ట్ షాపులు..!

  • పోలీసుల కార్డెన్ సెర్చ్‌లో..
  • 60 మోటార్ బైకులు, 10 ఆటోలు, 2 మ్యాక్స్ లు స్వాధీనం..!

3 Belt Shops | ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారుగూడలో ఈ రోజు ఉదయం ఆకస్మికంగా కార్డెన్ సెర్చ్(Carden Search) నిర్వహించగా, అక్రమ బెల్ట్ షాపుల బాగోతం బయటపడింది. అక్రమంగా మద్యం అమ్ముతున్న 3 బెల్ట్ షాపు(3 Belt Shop)లను పోలీసులు జప్తు చేశారు.

ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రసేన్(AR DSP Kamatham Indrasen) ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్టులో భాగంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. 70 మంది సిబ్బందితో ఉదయం 5 గంటల నుండి తనిఖీలు నిర్వహించగా ఎలాంటి పత్రాలు లేని 60 బైకులు, 10 ఆటోలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అక్రమంగా విక్రయిస్తున్న మూడు బెల్ట్ షాపులను బట్టబయలు చేసి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ప్రజల రక్షణ, సంరక్షణ సక్రమంగా నిర్వహించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్(Community Contact) (కార్డెన్ అండ్ సెర్చ్) లను నిర్వహించడం జరుగుతుందని ఏఆర్ డీఎస్పి కమతం ఇంద్రవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రజలతో మాట్లాడుతూ.. గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ఉండాలని సూచించారు.

ప్రజలు, యువత వాహనాలలో ప్రయాణించేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల(CCTV Cameras) ప్రాధాన్యతను తెలియజేస్తూ వాటి ఏర్పాటకు కృషి చేయాలని కోరారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించి సోషల్ మీడియా(Social Media) పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఐ లు కె ఫణిదర్, కె నాగరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు తోట మురళి, ఎన్ చంద్రశేఖర్, రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్, ఎస్ఐలు డి రాధిక, జీవన్ రెడ్డి, రాకేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply