Achampet | ఎమ్మెల్యే వంశీకృష్ణ పరామర్శ

Achampet | ఎమ్మెల్యే వంశీకృష్ణ పరామర్శ

Achampet | అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న అచ్చంపేట (Achampet) పట్టణ 1వ వార్డు కౌన్సిలర్ గౌరీశంకర్ ను టీపీసీసీ ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ (MLA Dr.Vamsi Krishna) గురువారం స్వయంగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

కౌన్సిలర్ ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే (MLA) వివరంగా అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలు, చికిత్సలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కుటుంబ సభ్యులకు సూచనలు అందించారు. గౌరీశంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply