45 Indians | సౌదీ అరేబియా మృతుల కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

45 Indians | సౌదీ అరేబియా మృతుల కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

45 Indians | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో 45 మంది భారతీయులు(45 Indians) చనిపోగా ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు ఉదయం సౌదీ అరేబియా(Saudi Arabiaలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.

కాగా విద్యానగర్‌లోని నసీరుద్దీన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్(KTR along with BRS) నేతలు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. వారంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించిన విషయం తెలిసిందే. కేటీఆర్ ఈ సంఘటనను తీవ్రంగా భావిస్తున్నట్లు, మృతుల కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

సౌదీ దుర్ఘటనలో నసీరుద్దీన్(Naseeruddin) కుటుంబానికి చెందిన 18 మంది మరణించడం(18 killed) అత్యంత బాధాకరంగా ఉందని కేటీఆర్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడుతూ… ఎటువంటి ఆర్థిక, సామాజిక సహాయం అవసరమైన పార్టీ ద్వారా అందజేస్తామని స్పష్టం చేశారు. అలాగే కుటుంబ సభ్యులతో సౌదీకి వెళ్లిన బీఆర్ఎస్ బృందం అక్కడి వారికి అవసరమైన సహాయం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply